Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 100 శాతం వాటా విక్రయం దిశగా ప్రభుత్వ ప్రయత్నాలు
న్యూఢిల్లీ: ఎస్పీవీ ఎయిర్ ఇండియా అసెట్స్ హౌల్డింగ్ లిమిటెడ్‌కు ఎయిర్ ఇండియా ఆస్తుల బదిలీపై పన్నులను ప్రభుత్వం మినహాయించింది. దీనిని జాతీయ క్యారియర్‌కు వ్యూహాత్మక పెట్టుబడులను సులభతరం చేసే చర్యల్లో భాగంగా ఉద్దేశించినదిగా పేర్కొంది. ఎయిర్ ఇండియా గ్రూపు రుణ మరియు ప్రధానేతర ఆస్తుల బదిలీ కోసం 2019లో ప్రభుత్వం ఎయిర్ ఇండియా అసెట్స్ హౌల్డింగ్ లిమిటెడ్ (ఎవైఎఐఎల్)ను ఏర్పాటు చేసింది. ఎయిర్ ఇండియా లిమిటెడ్ నుంచి ఏఐఏహెచ్‌ఎల్‌కు బదిలీల విషయంలో సెక్షన్ 194క్యూ కింద టీడీఎస్ మినహాయించరాదని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (సీబీడీటీి) తన నోటిఫికేషన్లలో తెలిపింది. అలాగే, స్థిరాస్తులను ఏఐఏహెచ్‌ఎల్‌కు బదిలీ చేయడం కొరకు ఎయిర్ ఇండియాకు చేసిన చెల్లింపులపై ఐ-టీ చట్టంలోని సెక్షన్ 194-ఐఏ కింద టీడీఎస్ మినహాయించబడదు. ఏవైఏహెచ్ఎల్కు వస్తువుల బదిలీకి సంబంధించి టీసీఎస్‌ను మినహాయించే ప్రయోజనాల కోసం ఎయిర్ ఇండియాను 'అమ్మకందారు'గా పరిగణించబోమని సీబీటీడీ పేర్కొంది. ఎయిర్ ఇండియా లిమిటెడ్ నుంచి ఏఐఏహెచ్‌ఎల్‌కు కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన ప్రణాళిక కింద మూలధన ఆస్తిని బదిలీ చేయడం ఆదాయపు పన్ను ప్రయోజనం కోసం బదిలీగా పరిగణించబడదని తెలిపింది. కాగా, ఏఐ ఎక్స్‌ప్రెస్ లిమిటెడ్‌లో ఎయిర్ ఇండియా 100 శాతం వాటా, ఎయిర్ ఇండియా శాట్స్ ఎయిర్ పోర్ట్ సర్వీసెస్ ప్రయివేట్ లిమిటెడ్‌లో 50శాతం వాటాతో సహా ప్రభుత్వ యాజమాన్యంలోని జాతీయ విమానయాన సంస్థలో తన వాటాలో 100శాతం విక్రయించడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. బిడ్లు వేయడానికి సెప్టెంబర్ 15చివరి తేదీకావడంతో వ్యూహాత్మక అమ్మకం కీలక దశకు చేరుకుంది. సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ఎయిర్ ఇండియా వ్యూహా త్మక అమ్మకాలను ఈ ఆర్థిక సంవత్సరంలో పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో భాగంగా ఈ ఆర్థిక సంవత్సరానికి పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యాన్ని రూ. 1.75లక్షల కోట్లుగా పెట్టుకున్నది.