Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నేడే ప్రమాణస్వీకారం
గాంధీనగర్ : గుజరాత్ కొత్త సీఎంగా భూపేంద్ర పటేల్(59) బాధ్యతలు చేపట్ట నున్నారు. ఇందులో భాగంగా నేడు(సోమవారం) ఆయన ప్రమాణస్వీకారం చేయను న్నారు. గుజరాత్ సీఎంగా విజరురూపానీ, ఆయన క్యాబినేట్ మంత్రులు శనివారం రాజీనామా చేసిన విషయం తెలిసిందే. దీంతో రాష్ట్ర కొత్త సీఎం ఎవరు అన్న ఊహాగానాల నేపథ్యంలో భూపేంద్ర పటేల్‌ను అనూహ్యంగా ఆపదవి వరిం చింది. ఆదివారం గాంధీనగర్‌లో జరిగిన బీజేపీ లేజిస్లేచర్ పార్టీ సమావేశంలో సీఎం ఎంపిక నిర్ణయాన్ని తీసుకున్నారు. ఆ రాష్ట్ర తాజా మాజీ సీఎం విజయ్ రూపానీ.. ఈ సమావేశంలో భూపేంద్ర పటేల్ పేరును ప్రతిపాదించారు. ఈ సమావేశానికి బీజేపీ ఎమ్మెల్యేలు హాజరై ఆయనను ఎన్నుకున్నారు. కాగా, ఎమ్మె ల్యేగా తొలిసారి ఎన్నికయిన భూపేంద్ర పటేల్‌కు ఏకంగా సీఎం పదవి వరించడం గమనార్హం. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో ఘట్లోడియా స్థానం నుంచి ఆయన ఎమ్మె ల్యేగా గెలిచారు. అంతకముందు గుజరాత్ మాజీ సీఎం ఆనందీబెన్ పటేల్ ఈ స్థానం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. సమావేశం అనంతరం భూ పేంద్ర పటేల్ మీడియాతో మాట్లాడారు. ప్రధాని మోడీ, బీజేపీ జాతీయాధ్యక్షులు జేపీ నడ్డా, కేంద్ర హౌంశాఖ మంత్రి అమిత్ షా లకు కృతజ్ఞతలు తెలిపారు. ఆనందీబెన్ ఆశీర్వాదాలు తనకు ఎప్పుడూ ఉంటాయన్నారు. అనంతరం రాజ్ భవన్కువెళ్లిన భూపేంద్ర పటేల్.. గవర్నర్ ఆచార్య దేవ్‌వ్రత్‌ను కలిశారు. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని గవర్నర్‌ను కోరారు. ఈ సందర్భంగా ఆయన వెంట విజరురూపానీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సీఆర్ పాటిల్‌లు కూడా ఉన్నారు.