Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రైతు సుశీల్ కాజల్ కుటుంబానికి ఏచూరి పరామర్శ
- ఖట్టర్ సర్కారు తీరుపై ఆగ్రహం
కర్నాల్: హర్యానాలోని కర్నాల్ జిల్లాలో రైతుల ఆందోళనపై పోలీసులు జరిపిన అమానుష లాఠీచార్జిలో తీవ్రంగా గాయపడి మరణించిన రైతు సుశీల్ కాజల్ కుటుంబాన్ని సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి పరామర్శిం చారు. వ్యవసాయ చట్టాల రద్దు కోసం జరిగే ఉద్య మంలో ఆ కుటుంబం ధైర్యం, సంకల్పం స్ఫూర్తిదాయకమని ఏచూరి అన్నారు. సుశీల్ కాజల్ కుటుంబానికి తమ పార్టీ అండగా ఉం టుందని, అన్ని రకాల సహాయ సహకారాలు అం దిస్తామని చెప్పారు. ఆదివారం కర్నాల్ జిల్లా రాయపూర్ జతన్ గ్రామంలో సుశీల్ కాజల్ కుటుంబసభ్యులను సీపీఐ(ఎం) బృందం పరా మర్శించింది. సుశీల్ కాజల్ తల్లి మూర్తిదేవి, భార్య సుదేష్దేవి తదితరులను కలుసుకున్నారు. పరామర్శించిన వారిలో సీతారాం ఏచూరితో పాటు పొలిట్ బ్యూరో సభ్యులు నీలోత్పల్ బసు, కేంద్ర కార్యదర్శి వర్గ సభ్యులు జోగేంద్ర శర్మ, ఏఐకేఎస్ హర్యానా ఉపాధ్యక్షుడు ఇంద్రజిత్ సింగ్, మహిళా సంఘం నేత జగ్మతి సంఘ్వాన్ తదితరులు ఉన్నారు.
అప్రజాస్వామ్యపద్ధతుల్లో ఖట్టర్ సర్కార్ : ఏచూరి
హర్యానాలోని ఖట్టర్ ప్రభుత్వం అప్రజాస్వామ్య పద్ధతుల్లో వ్యవహరిస్తున్నదని ఏచూరి విమర్శించారు. రైతులపై పోలీసులతో దాడి చేయించడమేంటని ప్రశ్నించారు. దేశానికి అన్నం పెట్టే అన్నదాతల ప్రాణాలను తీసేహక్కు ఎవరిచ్చారని ప్రశ్నించారు. రైతులపైకి పోలీసులను ఉసిగొల్పి, రైతుల తలలు పగలగొట్టాండని ఆదేశించిన అధికారిని రాష్ట్ర ప్రభుత్వం వెనకేసుకురావడం దారుణమన్నారు. దీన్ని తమ పార్టీ తీవ్రంగా ఖండిస్తుందని అన్నారు. దేశవ్యాప్తంగా రైతులు పెద్ద ఎత్తున ఉద్యమిస్తున్నారని, రోజు రోజుకు రైతుల ఉద్యమం బలోపేతం అవుతుందని పేర్కొన్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం అహం వీడి, రైతులతో చర్చించి డిమాండ్లు నెరవేర్చాలని హితవు పలికారు.
సిర్సాలో భారీ కిసాన్ మహా పంచాయత్
హర్యానాలోని సిర్సాలో ఆదివారం భారీ కిసాన్ మహా పంచాయత్ జరిగింది. సిర్సాలోని ధాన్యం మార్కెట్లో ఏర్పాటు చేసిన ఈ మహా పంచాయత్‌లో వేలాదిమంది రైతులు భాగస్వామ్యమయ్యారు. డిమాండ్లు నెరవేరే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని ప్రతిజ్ఞ చేశారు.బీజేపీ, దాని మిత్రపక్ష పార్టీల నాయకులకు వ్యతిరేకంగా నిరసనలు వివిధ ప్రదేశాలలో కొనసాగాయి. హర్యానాలోని జగధరి, తిగ్రాలో రైతులు నిరసన వ్యక్తం చేయడంతో బీజేపీ కార్యక్రమాలను రద్దు చేసుకోవాల్సి వచ్చింది. హర్యానాలోని జింద్‌లో రైతుల నిరసన తరువాత బీజేపీ సమావేశాన్ని నిలిపివేయాల్సి వచ్చింది. చెరకు ధరలను పెంచాలని, పీఎం కిసాన్ నిధులను రెట్టింపు చేయాలని బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ డిమాండ్ చేశారు. మహారాష్ట్ర నుంచి ప్రారంభమైన సైకిల్ మార్చ్‌ను భోపాల్ సమీపంలో మధ్యప్రదేశ్ పోలీసులు అడ్డుకున్నారు. రైతులను పోలీసులు అదుపులోకి తీసుకుని, వారి సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు.