Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐరాస సమవేశంలో జైశంకర్
న్యూఢిల్లీ : అఫ్ఘనిస్తాన్‌లో తలెత్తిన సంక్షోభం ప్రాంతీయ స్థిరత్వంపై విపత్కర ప్రభావాలు చూపిస్తాయని భారత విదేశాంగ మంత్రి ఎన్ జైశంకర్ ఆందోళన వ్యక్తం చేశారు. అఫ్ఘనిస్తాన్‌లోని పరిస్థితిపై జరిగిన ఐరాస ఉన్నత స్థాయిలో సమావేశంలో జైశంకర్ ప్రసంగించారు. అఫ్ఘనిస్తాన్‌ను తాలిబన్లు స్వాధీనం చేసుకున్న తరువాత జరుగుతున్న పరిణామాలను భారత్ పర్యవేక్షిస్తుందని తెలిపారు. ఇప్పటికే యుద్ధంతో దెబ్బతిన్న దేశం మరింత క్లిష్టమైన, సవాలు దశను దాటిపోతుందని అన్నారు. పెరుగుతున్న పేదరికంతో ముప్పు పొంచివుందని,అఫ్ఘనిస్తాన్‌లో సంక్షోభం ప్రాంతీయ స్థిరత్వంపై విపత్కర ప్రభావాలు చూపిస్తాయని జైశంకర్ పేర్కొన్నారు.