Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అహ్మదాబాద్: గుజరాత్ కొత్త ముఖ్యమంత్రిగా భూపేంద్ర పటేల్ బాధ్యతలు చేపట్టారు. రాష్ట్ర 17వ ముఖ్యమంత్రిగా భూపేంద్ర పటేల్ సోమవారం నాడు ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ ఆచార్య దేవ్వ్రత్ ఆయన చేత ప్రమాణస్వీకారం చేయించారు. కేంద్ర హౌం మంత్రి అమిత్‌షా, నరేంద్ర సింగ్ తోమర్, మన్షుఖ్ మాండవీయ,ప్రహ్లాద్ జోషి,పర్సోత్తమ్ రూపాల, ముఖ్యమంత్రులు మనోహార్‌లాల్ ఖట్టర్, వరాజ్ సింగ్ చౌహాన్, ప్రమోద్ సావంత్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన భూపేంద్ర పటేల్‌కు ప్రధాని మోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా సహా పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. కాగా, గత శనివారం విజరు రూపానీ, ఆయన మంత్రివర్గం రాజీనామా చేయడంతో కేంద్ర పరిశీలకుల సమక్షంలో ఆదివారం బీజేపీ ప్రజా ప్రతినిధులతో పార్టీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కొత్త ముఖ్యమంత్రిగా భూపేంద్ర పటేల్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యా రు.ఇదిలావుండగా,ఆయన మొదటిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయినప్పటికీ సీఎం పదవి దక్కడం విశేషం.