Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- యూపీ సీఎం రెచ్చగొట్టే వ్యాఖ్యలు
లక్నో : యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ మళ్లీ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. ఓ మతం ప్రజలను ఉటంకిస్తూ విద్వేశాన్ని రగిల్చేలా ప్రసంగించారు. 2017లో యూపీలో బీజేపీ అధికారంలోకి రాకముందు కేవలం 'ఒక వర్గం' ప్రజలు మాత్రమే రేషన్‌ను పొందారని యోగి అన్నారు. రాష్ట్రంలోని కుషినగర్ పట్టణంలో జరిగిన ఒక కార్యక్రమంలో ప్రజలనుద్దేశించి ప్రసంగించిన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. '' 2017కు ముందు మీరు రేషన్ పొందారా? గతంలో ' అబ్బ జాన్' అని సంబోధించే వారికే రేషన్ అందేది. శ్రీనగర్ కోసం ఉద్దేశించిన రేషన్ నేపాల్, బంగ్లాదేశ్‌లకు వెళ్లింది'' అని ఆయన అన్నారు. కాగా, యోగి వ్యాఖ్యలపై రాజకీయవర్గాల్లో దుమారం రేపుతున్నాయి. ' ఆ వర్గం' ప్రజలు సీఎం వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. యూపీలో అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం బీజేపీ అజెండా అని నేషనల్ కాన్ఫరెన్స్ నాయకుడు, జమ్మూకాశ్మీర్ మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా విమర్శించారు. ఎన్నికలు, రాజకీయాల్లో ప్రజల కోసం చేపట్టిన అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలు వంటివి చర్చ జరగాలనీ, కానీ బీజేపీ మాత్రం అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని తనకు ఆయుధమైన 'మతాన్ని' మళ్లీ తెరపైకి తెస్తున్నదని విశ్లేషకులు తెలిపారు. ఇందుకు ఒక వర్గాన్ని తప్పుగా చూపెడుతూ మరొక వర్గాన్ని రెచ్చగొడుతున్నారనీ, ఇందుకు యూపీ సీఎం వ్యాఖ్యలే నిదర్శనమని చెప్పారు.