Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 10వేల మందికి ఉద్యోగాలు
న్యూఢిల్లీ : మహిళలను సమగ్ర శ్రామిక శక్తిగా తీర్చిదిద్దడమే కాక ఆర్థిక పరంగా ఉపాధి అవకాశాలు కల్పించే యోచనతో తమ ఫ్యాక్టరీలో అత్యధిక మంది మహిళ కార్మికులకు అవకాశం కల్పిస్తున్నామని ఓలా చైర్మెన్ భవేశ్ అగర్వాల్ తెలిపారు. రానున్న కాలంలో తమిళనాడులోని ఓలా 'ఫ్యూచర్ ఫ్యాక్టరీ'ని మహిళామణుల చేత నిర్వహిస్తామన్నారు. తమ విద్యుత్ ద్విచక్ర వాహనాల తయారీ ఫ్యాక్టరీని దాదాపు 10 వేల మంది మహిళలే నడపనున్నారన్నారు. ప్రపంచంలోనే అత్యధిక మంది మహిళలు ఉన్న ఫ్యాక్టరీగా ఓలా ఫ్యూచర్ ఫ్యాక్టరీ నిలవనుందన్నారు. ఈ క్రమంలో మహిళల నైపుణ్యాలను పెంపొందించేలా శిక్షణ ఇవ్వడానికీ పెట్టుబడులు పెట్టామన్నారు. శ్రామిక శక్తిలో మహిళల సమానత్వానికీ ప్రాధాన్యత ఇస్తే భారత జీడీపీ 27 శాతం పెరగొచ్చని అధ్యయనాలు చెబుతున్నాయన్నారు. 500 ఎకరాల్లో ఈ విద్యుత్ ద్విచక్ర వాహన తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నారు. సెకన్‌కు రెండు ఈ- స్కూటర్లను ఉత్పత్తి చేయడమే ఆ కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది.