Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భారత్, అమెరికా పరస్పర సహకారం
- కేంద్ర మంత్రి భూపేందర్‌తో జాన్‌కెర్రీ భేటీ
న్యూఢిల్లీ : గ్రీన్ ఎనర్జీ లక్ష్యాల సాధనలో భారత్, అమెరికా పరస్పరం సహకరించుకు ంటాయని అమెరికా వాతావరణ ప్రత్యేక రాయబారి జాన్‌కెర్రీ సోమవారం పేర్కొన్నారు. 2030నాటికి 450 గిగావాట్ల పునరుత్పాదక శక్తిని స్థాపించేందుకు అమెరికా భారత్‌తో కలిసి పనిచేయనుందని ఆయన తెలిపారు.'' ఆర్థికంగా, సాంకేతికంగా, దానిని సాధించడానికి అవసరమై న ఇతర అంశాలను తీసుకురావడంలో భారత్‌తో భాగస్వామ్యం కోసం మేము ఎదురుచూస్తు న్నాము'' అని పేర్కొన్నారు. సోమవారం క్లైమేట్ యాక్షన్ అండ్ ఫైనాన్స్ మోబిలైజేషన్ డైలాగ్ (సిఎఎఫ్ఎండి) ప్రారంభోత్సవం సందర్భంగా కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్‌తో జాన్ కెర్రీ భేటీ అయ్యారు. గ్రీన్ ఎనర్జీ లక్ష్యాల సాధారణ, పర్యావరణ పరిరక్షణ లక్ష్యాల సాధారణలో ఈ చర్చలు భారత్, అమెరికా మధ్య సహకా రానికి శక్తివంతమైన మా ర్గం ఉపయోగపడతాయని కెర్రీ పేర్కొన్నారు. రెండు దేశాలకు వాతావరణ మార్పులపై సహకారాన్ని పునరుద్ధరించే అవకాశాన్ని సిఎఎఫ్ఎండి అందిస్తుందని భేటీ అనంతరం మంత్రి భూపేందర్ యాదవ్ ట్వీట్ చేశారు.