Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఎం కేసీఆర్ సంతాపం
న్యూఢిల్లీ: కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి ఆస్కార్ ఫెర్నాండెజ్ కన్నుమూశారు. ఈ ఏడాది జులైలో ఇంట్లో యోగా చేస్తున్న సందర్భంలో ఆయన కిందపడ్డారు. ఈ ప్రమాదంలో ఆయన మెదడులో రక్తం గడ్డకట్టింది. ఐసీయూలో చికిత్స పొందుతున్న ఆయనకు గడ్డకట్టిన రక్తాన్ని తొలగించేందుకు సర్జరీ నిర్వహించారు. అప్పటి నుంచి ఆయన మంగళూరులోని ఆస్పత్రి ఐసీయూలోనే ఉన్నారు. ఆరోగ్యం మరింతగా క్షిణించడంతో 81 ఏండ్ల ఫెర్నాండెజ్ సోమవారం తుదిశ్వాస విడిచారు. ఆయనకు భార్య బ్లోసమ్ ఫెర్నాండెజ్, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆయన మరణంతో పార్టీలతో సంబంధంలేకుండా నేతలు సంతాపం ప్రకటిస్తున్నారు.కాగా, 1941 మార్చి 27న ఉడుపిలో ఫెర్నాండెజ్ జన్మించారు. ఆయన తండ్రి రోక్ ఫెర్నాండెజ్ గొప్ప ఉపాధ్యాయుడిగా పేరుగాంచారు. తొలినాళ్లలో ఫెర్నాండెజ్ ఎల్ఐసీ ఏజెంట్గా పని చేశారు. ఆ తర్వాత మణిపాలో చిన్న వ్యాపారంలో కొనసాగుతూనే.. వ్యవసాయం సైతం చేశారు. ఉత్తమ రైతుగా కూడా అవార్డులు అందుకున్నారు.
ఈ నేపథ్యంలోనే సామాజిక కార్యక్రమాల్లో పాలుపంచుకుంటూ.. కాంగ్రెస్లో చేరారు. కార్యక్తరగా మొదలైన ఆయన జీవితం ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదిగి కాంగ్రెస్లో కీలక నేతల్లో ఒకరిగా ఎదిగారు. నాలుగుసార్లు ఎంపీగా, రెండు సార్లు రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. యూపీఏ గవర్నమెంట్లో ఫెర్నాండెజ్ కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రిగా పని చేశారు. 1980లో కర్నాటకలోని ఉడుపి నియోజకవర్గం నుంచి ఆయన లోక్సభకు ఎన్నికయ్యారు. అదే నియోజకవర్గం నుంచి 1984, 1989, 1991, 1996లో లోక్సభకు ప్రాతినిధ్యం వహించారు. 1998, 2004లో రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఆయన సేవలను కొనియాడుతూ కాంగ్రెస్, బీజేపీ సహా ఇతర పార్టీల నేతలు, ప్రముఖులు సంతాపం ప్రకటించారు. ఫెర్నాండెజ్ మృతి పట్ల సీఎం కేసీఆర్ సంతాపాన్ని వ్యక్తంచేశారు. యూపీఏ సర్కారులో సహచరమంత్రిగా ఆయనతో కలిసి పనిచేశాననీ, ఆయన మరణం దేశానికి తీరనిలోటని పేర్కొన్నారు.