Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : తమిళనాడులో 2018నాటి తూత్తుకుడి పోలీస్ కాల్పుల ఘటన భారత ప్రజాస్వామ్యానికి మాయని మచ్చ తెచ్చిందని మద్రాస్ హైకోర్టు వ్యాఖ్యా నించింది. వేదాంత గ్రూప్‌నకు చెందిన స్టెరిలైట్ కంపెనీకి వ్యతిరేకంగా నిరసనలు చేపట్టిన వారిపై నమోదైన కేసులన్నింటినీ రద్దు చేయాలని హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. స్టెరిలైట్ కంపెనీ నుంచి వెలువడుతున్న కాలుష్య కారకాలతో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని 2018లో తూత్తుకుడి జిల్లాలో నిరసనలు తీవ్రస్థాయికి చేరుకున్నాయి. ఈ నిరసనల్ని అడ్డుకునేందుకు మే 22, 2018న పోలీసులు కాల్పులకు తెగబడ్డారు. ఈ కాల్పుల్లో 15మంది నిరసనకారులు ప్రాణాలు కోల్పోయారు. దేశవ్యాప్తంగా ఈ ఘటన సంచలనం సృష్టించింది.