Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జలియన్‌వాలాబాగ్ ఆధునీకరణకు
- వ్యతిరేకంగా అమృత్‌సర్‌లో ఆందోళన
అమృత్సర్ : ఆధునీకరణ పేరుతో 1919 నాటి జలియన్‌వాలాబాగ్ చారిత్రక గుర్తుల చెరిపివేత ప్రయత్నాలను ఖండిస్తూ పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో మంగళవారం పెద్దయెత్తున ఆందోళన జరిగింది. కేంద్ర ప్రభుత్వ తీరుకు నిరసనగా నగరంలో పలు రాజకీయ, రైతు, సామాజిక సంస్థలకు చెందిన నేతలు భారీ ర్యాలీ చేపట్టాయి. ఈ మార్చ్‌లో జలియన్‌వాలాబాగ్ అమరవీరుల బంధువులు కూడా పాల్గొన్నారు. ఆధునీకరణ పేరుతో చారిత్రక గుర్తులను చెరిపేస్తున్నారని ఆందోళనకారులు ఆగ్రహం వ్యక్తం చేశారు.