Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 17న జిఎస్టి కౌన్సిల్ సమావేశంలో చర్చ
న్యూఢిల్లీ : బీహార్ రాజధాని పాట్నాలో ఈనెల 17న జీఎస్టీ కౌన్సిల్ భేటీ కానుంది. ఈ భేటీకి కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌తో పాటు అన్ని రాష్ట్రాల ఆర్థిక మంత్రులు పాల్గొననున్నారు. పెట్రోల్, డీజిల్, ఇతర పెట్రోలియం ఉత్పత్తులను వస్తుసేవల పన్ను (జీఎస్టీ) పరిధిలోకి తీసుకొచ్చే అంశాన్ని ఈ సమావేశం పరిగణనలోకి తీసుకొని చర్చించే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. అదేవిధంగా కోవిడ్-19 చికిత్సకు అవసరమయ్యే ఔషధాలకు ఇచ్చిన పన్ను రాయితీలను పొడిగించే అంశంపైనా చర్చించనున్నట్టు తెలుస్తోంది. దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు రికార్డు స్థాయికి చేరిన విషయం తెలిసిందే. అత్యధిక రాష్ట్రాల్లో పెట్రోల్ ధర సెంచరీ దాటింది. ఆయా ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావడం ఈ ధరల పెరుగుదల సమస్యకు ఒక పరిష్కారంగా మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. దీని ద్వారా పన్నుపై పన్ను విధించే విధానానికి ముగింపు పలికినట్లు అవుతుందని పేర్కొంటున్నారు.