Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వ్యవసాయ రంగం ఆధునీకరణ పేరిట జియో, ఐటీసీ తదితర కంపెనీలు : వ్యవసాయ శాఖ ఎంఓయూ
న్యూఢిల్లీ : ఐదు ప్రయివేటు కంపెనీలతో కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ ఒప్పందం కుదుర్చుకుంది. మంగళవారం నాడిక్కడ కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ కార్యాలయం (క్రిషి భవన్)లో జరిగిన సమావేశంలో కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ జియో ప్లాట్ఫామ్ లిమిటెడ్, ఐటీసీ లిమిటెడ్, సీఐఎస్సీఓ, ఎన్సీడీఈఎక్స్ ఈ-మర్కెట్ లిమిటెడ్ (ఎన్ఈఎంఎల్), నింజాకార్ట్ తదితర ప్రయివేట్ కంపెనీలతో పైలట్ ప్రాజెక్టుల కోసం ఎంఓయూ కుదుర్చుకున్నారు. దీనిద్వారా వ్యవసాయ రంగం ఆధునీకరణకు కొత్త టెక్నాలజీలను ప్రవేశపెట్టడం జరుగుతుందనీ, రైతులు తమ ఆదాయాలన్ని పెంచుకోవచ్చని కేంద్ర మంత్రి తోమర్ అన్నారు. జియో మహారాష్ట్ర రెండు జిల్లాల్లో పైలట్ ప్రాజెక్టు నిర్వహిస్తుంది. అవి జల్నా, నాసిక్ జిల్లాలుగా ఎంపిక చేశారు. ఐటీసీ మధ్యప్రదేశ్లోని సెహౌర్, విదిషా జిల్లాలలో గుర్తించబడిన గ్రామాల్లో అమలు చేయబడుతుంది. సీఐఎస్సీఓ కైతాల్ (హర్యానా), మొరెనా (మధ్యప్రదేశ్) నిర్వహిస్తుంది. ఎన్సీడీఈఎక్స్ ఈ-మర్కెట్ లిమిటెడ్ (ఎన్ఈఎంఎల్) గుంటూరు (ఆంధ్రప్రదేశ్),దేవనాగెరె (కర్నాటక), నాసిక్ (మహారాష్ట్ర) పనిచేస్తుంది. నింజాకార్ట్ చింద్వారా (మధ్యప్రదేశ్), ఆనంద్ (గుజరాత్), ఇండోర్ (మధ్యప్రదేశ్)లో కార్యకలాపాలు నిర్వహిస్తుంది. ఈ కార్యక్రమంలో కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రులు కైలాష్ చౌదరి, శోభా కరంద్లాజే, వ్యవసాయ మంత్రిత్వ శాఖ కార్యదర్శి సంజరు అగర్వాల్, అదనపు కార్యదర్శి వివేక్ అగర్వాల్, జియో కార్పొరేట్ అఫెర్స్ అధ్యక్షుడు శంకర్ అడవాల్, సీఐఎస్సీఓ ఎండి హరీష్ కృష్ణన్, నింజాకార్డ్ సీఈఓ తిరుకుమరన్ నాగరాజన్, ఐటీసీ డివిజనల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ రజనీకాంత్ రారు, ఎన్సీ డీఈఎక్స్ ఈ-మార్కెట్స్ లిమిటెడ్ ఎండీ మగంక్ పరంజాపే తదితరులు పాల్గొన్నారు.