Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తప్పుడు సమాచారం, లేఖలు అందించారని ఆరోపణ
భువనేశ్వర్: ఒడిశాలోని జగత్సింగ్పూర్ పరిధిలోని గ్రామ ప్రజలు గ్రీన్‌ఫీల్డ్ ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటును వ్యతిరేకిస్తూ.. తమ భూములను కాపాడుకోవడం కోసం ఆందోళనకు దిగారు. దీని ఏర్పాటుకు సంబంధించి ప్రజాభిప్రాయ సేకరణలో జేఎస్‌డబ్ల్యూ ఉత్కల్ స్టీల్ లిమిటెడ్ తప్పుడు సమాచారంతో పాటు నకిలీ లేఖలను అందించిందని ప్రజలు ఆరోపిస్తున్నారు. దీని ఏర్పాటు కారణంగా స్థానిక పర్యావరణం, అక్కడి జీవ వైవిధ్యం నాశనమవుతుందని ప్రజలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. అందుకే చాలా కాలం నుంచి ధింకియా, నువాగావ్, గడకుజంగ, బలితుత గ్రామ పంచాయతీలు ఈ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తున్నాయి. ఈ ప్రాజెక్టు ఏర్పాటుకు సంబంధించి జరిగిన ప్రజా సేకరణలో దానికి అనుకూలంగా పంపిన 1,082 రాతపూర్వక దరఖాస్తులలో సంతకం చేసిన వారిలో చాలా మంది నిరక్షరాస్యులతో పాటు చిన్న పిల్లలు ఉన్నారు. మరీ ముఖ్యంగా ఇందులో చనిపోయినవారి పేర్లు సైతం పేర్కొనడం గమనార్హం. దీనిపై పలువురు గ్రామ ప్రజలు మాట్లాడుతూ.. తాము అందించిన అభిప్రాయపత్రాల్లో సంతకాలు చేసి ఉండగా.. వాస్తవానికి ఏ భాషలోనూ సంతాకాలు చేయాలేని వారి పేర్లు సైతం ఉన్నాయి. అలాగే, 10-13 ఏండ్ల పిల్లల పేర్లు సైతం ఉన్నాయి. దీని గురించి వారి తల్లిదండ్రులకు, పిల్లలకు సైతం తెలియకపోవడం గమనార్హం. ఇదంతా గమనిస్తే.. స్థానిక పరిపాలన యంత్రాంగం వారి గొంతుకలను నొక్కే ప్రయత్నం చేస్తున్నదని పేర్కొంటూ దీనిపై న్యాయమైన, పారదర్శకమైన విచారణకు ఆదేశించాలని పేర్కొంటూ ఆ ప్రాజెక్టుకు సంబంధించిన క్లియరెన్స్‌ను తిరస్కరించాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు. దాదాపు ఒక దశాబ్దం క్రితం, ఇక్కడి గ్రామాల ప్రజలు సహా తీర ప్రాంత రైతులు, మత్స్యకారులు, వివిధ సంఘాల సమూహాలు పోస్కో ఇండియా లిమిటెడ్‌తో ఇదే విధమైన పోరును సాగించారు. ఈ ఆందోళనల్లో నలుగురు ప్రాణాలు సైతం కోల్పోవడంతో.. పరిపాలన యంత్రాంగ చట్టవిరుద్ధమైన చర్యలకు వ్యతిరేకంగా జరిగిన ఈ నిరసనలు ప్రపంచ దృష్టిని ఆకర్షించాయి