Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రభుత్వాలను ప్రశ్నించే హక్కులేదా?: సిటిజన్స్ కలెక్టివ్
- పౌర సంఘాలు, సామాజిక కార్యకర్తలు, పలువురు ప్రజాప్రతినిధుల డిమాండ్
న్యూఢిల్లీ: పౌరసత్వ సవరణ చట్ట (సీఏఏ) వ్యతిరేక పోరాటంలో అరెస్టై ఏడాది కాలంగా జైల్లో ఉన్న విద్యార్థి నాయకుడు ఉమర్ ఖలీద్ను వెంటనే విడుదల చేయాలని పలువురు ప్రముఖులు, సామాజిక కార్యకర్తలు, జర్నలిస్టులు, ప్రజా ప్రతినిధులు డిమాండ్ చేశారు. సీఏఏ వ్యతిరేక నిరసనల సమయంలో ఈశాన్య ఢిల్లీలో చోటుచేసుకున్న అల్లర్ల ఘటనతో సంబంధముందన్న ఆరోపణలతో ఉమర్ ఖలీద్ను గతేడాది సెప్టెంబరు 13న ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయన అరెస్టుకు ఏడాది కావడంతో.. న్యూఢిల్లీలోని ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియాలో బహిరంగా సమావేశం నిర్వహించారు. ఈ నేపథ్యంలోనే ఉమర్ ఖలీద్ను విడుదల చేయాలని సిటిజన్స్ కలెక్టివ్ డిమాండ్ చేసింది. ప్రభుత్వాలను, పాలకులను ప్రశ్నించే హక్కు పౌరులకు లేదా? అంటూ పౌర సంఘాల నాయకులు, కార్యకర్తలు, పలువురు జర్నలిస్టులు, ప్రజాప్రతినిధులు ప్రశ్నించారు. ఉమర్ ఖలీద్ను అన్యాయంగా జైల్లో పెట్టారని పేర్కొన్నారు. ప్రభుత్వం ప్రజలను చైతన్యవంతులను చేసే కార్యకర్తలను, యువకులను లక్ష్యంగా చేసుకుని పోలీసు విచారణ పేరుతో వారి హక్కులను హరిస్తున్నదని తెలిపారు. ఖలీద్ను మొదట అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆ తర్వాత ఆయనపై చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (ఉపా) కింద కేసు నమోదు చేశారు. అప్పట్నుంచి ఆయన జైల్లోనే ఉన్నారు. ఆయన్ను ఏడాది కాలంగా అన్యాయంగా కారాగారంలో ఉంచారంటూ ప్రణాళిక సంఘం మాజీ సభ్యురాలు సయేదా హమీద్, సుప్రీం కోర్టు న్యాయవాది ప్రశాంత్ భూషణ్, ఆర్జేడీ ఎంపీ మనోజ్ ఝా, పాత్రికేయుడు సిద్ధార్థ్ వరదరాజన్ పేర్కొన్నారు. రాజ్యాంగ వ్యతిరేక విధానాలపై పోరాటం చేసినందుకే ఖలీద్ను ప్రభుత్వం తప్పుడు సాక్ష్యాలతో అరెస్టు చేసిందన్నారు.
ఉపా చట్టాన్ని తొలగించండి
బాధితులను కుట్రదారులగా చేశారని ఢిల్లీ మైనారిటీల కమిషన్ మాజీ చైర్పర్సన్ జఫరుల్ ఇస్లాంఖాన్ అన్నారు. ''ఉన్నత స్థాయి న్యాయ విచారణ జరగాలి. కానీ అది ఇంకా జరగలేదు. దర్యాప్తు లేకుండానే అనేక ఎఫ్ఐఆర్లు నమోదుచేశారు. స్థానికులు ఇబ్బందులకు గురవుతున్నా వారికి సాయం అందడం లేదు. ఉపా వంటి నల్ల చట్టాలను తొలగించాలి'' అని ఆయన అన్నారు. ప్రముఖ పాత్రికేయులు సిద్ధార్థ్ వరదరాజన్ మాట్లాడుతూ.. ఢిల్లీలో అమలు చేసే చట్ట విధానం వాస్తవానికి మతతత్వ కుట్రదారులకు ఉచిత పాసులు అందించేలా ఉందని ఆరోపించారు. సీనియర్ పాత్రికేయులు భరత్ భూషణ్, రైతు నాయకుడు జస్పీర్ కౌర్, రాష్ట్రీయ జనతాదళ్ మనోజ్ ఝాలు ఖలీదు అరెస్టును ఖండించారు. ఇదిలావుండగా, సోషల్మీడియాలో చఖఎaతీ1్వaతీ×అబర్ఱషవ హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్లో కొనసాగింది.