Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్ర క్యాబినెట్ ఆమోదం
న్యూఢిల్లీ : ఆటోమొబైల్ పరివ్రమ, డ్రోన్ పరిశ్రమలకు ఉత్పత్తి అనుసంధానిత ప్రోత్సాహక పథకాన్ని(పీఎల్ఐఎస్) వర్తింపజేసే ప్రతిపాదనలకు కేంద్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ప్రధాని మోడీ అధ్యక్షతన బుధవారం సమావేశమైన కేంద్ర మంత్రి మండలి ఈమేరకు నిర్ణయం తీసుకున్నది. ఈ పథకంలో భాగంగా రానున్న ఐదేండ్లలో రూ. 26,058 కోట్ల మేర నిధులను కేటాయించనున్నారు. అధిక విలువతో కూడిన అడ్వాన్స్డ్ ఆటోమోటివ్ టెక్నాలజీ వాహనాలు, ఉత్పత్తులకు ఈ పీఎల్ఐ స్కీమ్ ద్వారా ప్రోత్సాహకాలు అందిస్తారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, మెరుగైన సామర్థ్యం, గ్రీన్ ఆటోమోటివ్ వాహనాల తయారీకి ఈ చర్య ఊతమిస్తుందని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ విలేకరుల సమావేశంలో వివరించారు.