Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కొత్త క్యాబినెట్ ఏర్పాటుకు ముందే ముసలంపాత వారికి నో ఛాన్స్.. మాజీ సీఎం,డిప్యూటీ సీఎం అలక..
- ప్రధాని సొంత రాష్ట్రంలోనే అసంతృప్తసెగలు..
- మంత్రివర్గ విస్తరణ వాయిదా.. నేడు ముహుర్తం..
గాంధీనగర్: మోడీ సొంత రాష్ట్రమైన గుజరాత్ గురించి బెంగపట్టుకున్నది. బీజేపీ పాలిత రాష్ట్రమై ఉండి కూడా...అక్కడ సీఎంగా భూపేంద్రపటేల్ నియమించి నాలుగురోజులైనా...మంత్రివర్గ విస్తరణ మాత్రం కొలిక్కిరాలేదు. హడావుడిగా నేడు (గురువారం) 27 కొత్తమంత్రులతో క్యాబినెట్ ఏర్పాటు చేయాలని హై కమాండ్ ఆదేశించినా..రుపానీ క్యాబినెట్లో ఉన్న మంత్రులను పక్కనబెట్టడంతో..బీజేపీలో ముసలం పుట్టింది. సామాజిక సమీకరణలు ఉన్నాయంటూ కొత్త సీఎం చెబుతున్నా...కీలకమైన వర్గాలను,సీనియర్లను కాదన్న తీరు అధికారపార్టీ బీజేపీలో ప్రకంపనలు సృష్టిస్తున్నది.
ఆరునెలల్లో నాలుగో సీఎంగా రూపానీ అవుట్
గత ఆరు నెలల్లో బీజేపీ దించిన ముఖ్యమంత్రిగా నాలుగో నేత విజరు రూపానీ . గుజరాత్ ఎన్నికలకు కేవలం 15 నెలల ముందు హైకమాండ్ ఆదేశాలతో గుజరాత్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు , ఉత్తరాఖండ్, కర్నాటక, గుజరాత్ ఈ మూడు రాష్ట్రాలలో ఆరు నెలల్లో మార్చబడిన నాలుగో సీఎంగా రూపానీపై బీజేపీ బ్లాక్‌లైన్ గీసింది. పదవి నుంచి బరబరా దించేసింది. అంతకుముందు సీఎంగా ఉన్న ఆనందిబేన్ను దించేసి. మాస్ లీడర్ కాకపోయినా రూపానీని తెచ్చి మోడీ, అమిత్‌షా ద్వయం కుర్చీమీద కూర్చొపెట్టారు. ఇపుడు అతనూ పనికిరాడంటూ భూపేంద్ర పటేల్‌కు పట్టం కట్టారు. దీనిపై పార్టీలోనే అసంతృప్తి జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. దీనికి తోడు పాత క్యాబినెట్‌ను పక్కనపెట్టాలని మోడీ,అమిత్‌షాల వ్యూహం బెడిసికొట్టే సూచనలు కనిపిస్తున్నాయి.
మాజీ సీఎం ఇంటికి అసంతృప్తుల క్యూ..
గుజరాత్ నూతన క్యాబినెట్ బుధవారం ప్రమాణ స్వీకారం జరగాల్సి ఉండగా..దాన్ని గురువారానికి వాయిదావేశారు. అసంతృప్త ఎమ్మెల్యేలంతా మాజీ సీఎం విజరు రూపానీ ఇంటికి క్యూ కట్టారు. వీరిలో ఈశ్వర్ పటేల్,ఈశ్వర్ పర్మార్,బచు ఖబడా, వాసణ్ అహిర్,యోగేశ్ పటేల్,లు వెళ్లి తమగోడు వినిపించారు. తమకు మంత్రిపదవులు దక్కలేదంటూ వారంతా రూపానీతో అన్నట్టు తెలిసింది.
రూపానీ రాజీనామా చేశాక... బీజేపీలోని సీనియర్ లీడర్లు నితిన్ పటేల్,భుపేంద్ర సింగ్ చుడ్మా, ఆర్సీ ఫాల్దు,కౌళిక పటేల్‌ల రాజకీయ ప్రశ్నార్థకంగా మారింది. భూపేంద్ర పటేల్ సీఎం అయ్యాక ..ప్రసుతం డిప్యూటీ సీఎంగా ఉన్న నితిన్ పటేల్ కుర్చీపై నీలీ నీడలు కమ్ముకున్నాయి.ఎందుకంటే భూపేంద్ర పటేల్, నితిన్ పటేల్ ఇద్దరు పటేల్ సామాజిక వర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న వారే .అందువల్ల తన పదవి ఎక్కడ ఊడుతున్నదోనన్న భయం ప్రస్తుత డిప్యూటీ సీఎంను వెంటాడుతున్నది.
ఇరకాటంలో మోడీ ,అమిత్ షా
రూపానీ క్యాబినెట్లో ఉన్న 11 మందిలో నుంచి కేవలం ఇద్దరిని తీసుకునే సంకేతాలొస్తున్నాయి. ఎన్నికలకు ముందే పదవుల్లోనుంచి తొలగిస్తారా..?..మాజీ లయ్యాక ఏం ముఖం పెట్టుకుని జనం ముందుకు వెళ్లాలని..పాత మంత్రులు లోలోన కుమిలిపోతున్నారు. ఇప్పటికే వాయిదా పడిన మంత్రివర్గ విస్తరణ మోడీ, అమిత్‌షాలను ఇరకాటంలో నెట్టిందనే చెప్పవచ్చు. గుజరాత్ రాష్ట్రంనుంచి ప్రాతినిధ్యం వహిస్తూ కూడా...అక్కడి అసంతృప్తులను బుజ్జగించకుండా... వాయిదా వేయటంపై కూడా బీజేపీలో చర్చానీ యాంశంగా మారింది. ఎన్నికలకు ముందు అనుసరించిన ఫార్ములా ఎక్కడ దెబ్బకొడుతున్న దోనన్న భయం పార్టీ వర్గాలను వెంటాడుతున్నది.