Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అవస్థల్లో సిబ్బంది, ఉద్యోగులు
- ఫుడ్, గ్రోసరీ డెలివరీ సంస్థల ఇన్సెంటివ్ వేధింపులు
న్యూఢిల్లీ : భారత్‌లో ఆన్లైన్ ఫుడ్, గ్రోసరీ డెలివరీకి భారీగా డిమాండ్ ఉన్నది. ముంబయి, ఢిల్లీ, చెన్నై, బెంగళూరు, హైద రాబాద్, కోల్‌కతా వంటి అగ్రశ్రేణి నగరాలతో పాటు దేశవ్యా ప్తంగా ద్వితీయశ్రేణి నగరాలు, పట్టణాలు, గ్రామాలకూ ఇది పాకింది. దీంతో డెలివరీ సంస్థలు ఈ డిమాండ్‌ను క్యాష్ చేసు కునేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్నాయి. కస్టమర్లను ఆక ర్షించేందుకు ఆఫర్లతో పాటు పలు దారులను ఎంచుకుంటు న్నాయి. ఇందులో ఒకటే కస్టమర్లకు ఆర్డర్‌ను వీలైనంత త్వర గా డెలివరీ చేయడం. ఇందుకు సంస్థలు నిర్ణీత సమయాన్ని పెట్టి.. ఆ సమయంలోగా ఆర్డర్‌ను డెలివరీ చేస్తామంటూ ప్రక టనలు ఇస్తున్నాయి. ఐటీ, బ్యాంకు, షేర్ మార్కెట్‌తో పాటు ఇలా పలు రంగాలకు చెందిన ఉద్యోగులు, గృహిణులు, విద్యా ర్థులు, యువత.. సమయాన్ని ఆదా చేసుకోవడంతో పాటు ఆఫర్లకు ఆకర్షితులై డెలివరీ సంస్థలు ప్రకటిస్తున్న ఇలాంటి 'క్విక్ డెలివరీ'కి ప్రాముఖ్యతనిస్తున్నారని వాణిజ్యరంగ నిపుణు లు విశ్లేషించారు.క్విక్ డెలివరీ విధానం ఇటు కస్ట మర్లకు సంతృప్తినిస్తున్నాయి. అటు ఫుడ్డెలివరీసంస్థలు, రెస్టారెంట్లకు లాభాలూ తెస్తున్నాయి. కానీ, ఈ సంస్థలకు చెం దిన డెలివరీ సిబ్బందికి ఇవి తీవ్ర ఇబ్బందులను తెచ్చిపెడు తున్నాయి.
ఆలస్యమైతే కోతలే..!
ఆర్డర్‌ను కస్టమర్‌కు చేర్చేందుకు ఇరుకు గల్లీలు, ట్రాఫిక్ జామ్‌లు, ఆకాశాన్ని తాకే అపార్ట్మెంట్లు, నెట్వర్క్ సమస్యలు ఇలా పలు అవరోధాలను డెలివరీ బార్సు దాటాల్సి ఉంటుంది. ఇన్ని ఇబ్బందులను దాటుకొని ఆర్డర్‌ను డెలివరీ చేసే ఉద్యోగులు.. కాస్త ఆలస్యం జరిగిందన్న కారణంగా వారు తమ జీత, భత్యాల్లో కోతలు ఎదుర్కోవాల్సి వస్తున్నది. దీంతో తాము ఎన్నో కష్టాలు పడి అవరోధాలను దాటి కస్టమర్లకు ఆర్డర్లను డెలివరీ చేసినప్పటికీ కొన్ని సందర్భాల్లో ఆ శ్రమంతా బూడిదలో పోసిన పన్నీరవుతోందని ఫుడ్ డెలివరీ బార్సు ఆవేదన చెందారు.
'కొన్ని సందర్భాల్లో ఐడీలూ బ్లాక్'
కొన్ని సార్లు నిమిషాల వ్యవధిలో డెలివరీ ఆలస్యం జరిగితే కస్టమర్ల నుంచి నెగెటివ్ ఫీడ్‌బ్యాక్, రేటింగ్‌లు వస్తాయనీ.. మరోపక్క సంస్థలు తమకు చెల్లించే చెల్లింపుల్లో కోతలు విధిస్తాయని ఆవేదన చెందారు. కొన్ని సందర్భాల్లో డెలివరీవర్కర్ల ఐడీలు బ్లాక్అవుతాయని యాప్-బేస్డ్ ట్రాన్స్పోర్ట్ వర్క ర్స్ ఇంటర్నెట్ ఫెడరేషన్ జాతీయ ప్రధాన కార్యదర్శి షేక్ సల్లావుద్దీన్ తెలిపారు. తామంత పేద, దిగువ మధ్యతరగతి, మధ్యతరగతి కుటుంబాలకు చెందినవారమనీ, ఫుడ్‌డెలివరీ సంస్థల 'క్విక్ డెలివరీ' విధానం తమ మెడకు చుట్టుకుంటున్నదని డెలివరీ కార్మికులు ఆందోళన చెందారు.
డెలివరీ సంస్థల పోటీ
ఆన్లైన్ ఫుడ్, గ్రోసరీ డెలివరీ సంస్థలు ఒకదానితో మరొకటి ఆర్డర్ల డెలివరీ విషయంలో తమ కస్టమర్లను ఆకర్షించేందుకు పోటీ పడుతున్నాయి. ఢిల్లీ, గురుగ్రామ్, ముంబయి, బెంగళూరు, హైదరాబాద్, కోల్‌కతా, జైపూర్, ఘజియాబాద్, నోయిడా, లక్నో వంటి పది నగరాల్లో పది నిమిషాల్లో ఫుడ్‌ను డెలివరీ చేస్తామని 'గ్రోఫర్స్' గతనెల 17న ప్రకటించింది. అలాగే, డెలివరీ స్టార్టప్ అయిన 'డుంజో'.. 19 నిమిషాల డెలివరీని బెంగళూరులో తన సేవలను మొదలుపెట్టింది. ఇక ముంబయి సబ్అర్బన్లలోని రెండు ప్రాంతాల్లో పది నిమిషాల గ్రోసరీ డెలివరీకి 'జెప్టో' సిద్ధమైంది. ఇక అగ్రశ్రేణి ఫుడ్‌డెలివరీ సంస్థల్లో ఒకటైన స్విగ్గీ.. బెంగళూరు, గురుగ్రామ్, ఢిల్లీ, ముంబయి, హైదరాబాద్, చెన్నై, నోయిడా వంటి నగరాల్లో 30 నిమిషాల్లోగా ఆర్డర్‌ను డెలివరీ చేస్తామని ప్రకటించింది.
'శ్రమదోపిడీకి గురవుతున్నరు..'
'క్విక్ డెలివరీ' విధానంతో ప్రపంచవ్యాప్తంగా అనేక సంస్థలు విజయాన్ని రుచి చూశాయి. టర్కీలోని గెటిర్, గొరిల్లాస్, బ్రిటన్‌లోని దిజా వంటి క్విక్-కామర్స్ సంస్థలు ఈ జాబితాలోనివే. దీంతో అతిపెద్ద మార్కెట్‌గా ఉన్న భారత్‌లో కొన్నేండ్లుగా ఇదే ట్రెండ్ మొదలైందని వాణిజ్య నిపుణులు చెప్పారు. ప్రజల్లోనూ తాము కొనే విధానాన్ని మార్చుకున్నారనీ, ఇప్పుడు చాలా మంది ఆన్లైన్ షాపింగ్‌లు, ఆర్డర్లకే మొగ్గు చూపుతున్నారని చెప్పారు. 'అనుకూలత, తక్షణ సేవల' పట్ల వారు ఆసక్తి కనబరుస్తున్నారని గ్లోబల్‌డేటా రిటైల్ అనలిస్ట్ అంకితా రారు అన్నారు. ఇందుకు, కరోనా కూడా అదనంగా ఒక కారణమైందని వివరించారు. అయితే, సంస్థల జిమ్మిక్కులు, అత్యుత్సాహం డెలివరీ సిబ్బందికి, ఉద్యోగులకు కష్టాలను తెచ్చిపెడుతున్నదనీ, మరీముఖ్యంగా వారిని శ్రామిక దోపిడీకి గురువుతున్నారనే ఆరోపణలు కార్మిక సంఘాల నుంచి వినబడుతున్నాయి. ఈ విషయాన్ని సంస్థలు గుర్తెరగాలని డెలివరీ కార్మికులు తెలిపారు. అవసరమైతే ప్రభుత్వాలు కూడా ఈ విషయంలో దృష్టిని సారించాలని కోరారు.