Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- యూఎన్ నివేదిక
న్యూఢిల్లీ : భారత్ వ్యవసాయంపై ఆధారపడిన దేశం. దాదాపు అధికశాతం మంది ప్రజలు వ్యవసాయమే ప్రధాన వృత్తిగా కలిగి ఉన్నారు. కోట్లాది మంది వ్యవసాయం, వ్యవ సాయ ఆధారిత రంగంపై ఆధారపడి జీవిస్తున్నారు. ఇలాంటి దేశంలో రైతుల కోసం ప్రత్యేక పథకాలతో చేయూతనందించాల్సిన మోడీ ప్రభుత్వం అందుకు విరుద్ధంగా వ్యవ హరిస్తున్నది. వారికి సాయం అందించడాన్ని పక్కనబెడితే.. రైతుల నుంచే లక్షలాది రూపా యలను దోచుకుంటున్నది. ఐక్యరాజ్యసమితి (యూఎన్) సంస్థలు రూపొందించిన నివేదిక లో ఈ విషయం వెల్లడైంది. ఈనెల 23న జరగబోయే 'ఫుడ్ సిస్టమ్స్ సమ్మిట్' కార్యక్రమం సందర్భంగా ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ (ఎఫ్ఏఓ), యూఎన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ (యూఎన్డీపీ), యూఎన్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ (యూఎన్ఈపీ)లు ఈ నివేదికను విడుదల చేశాయి. 'ఏ మల్టీ- బిలియన్- డాలర్- అపార్చునిటీ' పేరుతో విడుదలైన ఈ నివేదిక వ్యవసాయ సహాయక వ్యవస్థల సంస్కరణ, పునర్నిర్మాణం గురించి డిమాండ్ చేసింది. ఈ నివేదిక ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా వ్యవసాయ ఆధారిత దేశాలు తమ దేశంలోని రైతుల కోసం, వారి సంక్షేమం కోసం కృషి చేస్తున్నాయి. అయితే, రైతుల మీదనే భారం మోపే భారత్ వంటి దేశాలు ప్రపంచవ్యాప్తంగా చాలా అరుదు. భారత్లో గత 20 ఏండ్ల నుంచి వ్యవసాయ రంగం విస్తృతంగా దోపిడీకి గురవుతున్నది. మధ్య ఆదాయ దేశాలు వ్యవసాయం రంగం కోసం మద్దతును విస్తృతం చేశాయి. కానీ, భారత్, అర్జెంటీనా, ఘనా దేశాలు వినియోగదారులను దృష్టిలో పెట్టుకొని, ఫుడ్ ఇన్ఫ్లేషన్ను తక్కువగా ఉంచడానికి రైతులపై భారాన్ని మోపుతున్నాయి.