Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: 2021 ఏడాదిలో అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల జాబితాలో సీరం ఇనిస్టిట్యూట్ సీఈవో అదార్ పునవాలా చోటుసంపాదించుకున్నారు. తాజాగా 2021 సంవత్సరానికి గాను అత్యంత ప్రభావవంతమైన 100 మంది వ్యక్తుల జాబితాను టైమ్ మ్యాగజైన్ విడుదల చేసింది. టైమ్ మ్యాగజైన్ 18వ వార్షిక జాబితాలో మార్గదర్శకులు, కళాకారులు, నాయకులు, ఆవిష్కర్తలతోపాటు పలు ఇతర రంగాలకు చెందినవారు సైతం ఉన్నారు. ఇక భారత్ నుంచి 100 ప్రభావవంతమైన వ్యక్తుల జాబితాలో చోటుదక్కించుకున్న వారరిలో అదార్ పూనవాలాతో పాటు ప్రధాని మోడీ, బెంగాల్ సీఎం మమతా బెనర్జీలు ఉన్నారు. ఇదిలావుండగా, ఈ జాబితాలో అత్యంత చిన్న వయస్కురాలిగా 18 ఏండ్ల జిమ్నాస్ట్ సునీసా లీ.. పెద్ద వయస్కుడిగా 78 ఏండ్ల అమెరికా అధ్యక్షుడు జో బైడెన్లు ఉన్నారు. ఇదే జాబితాలో అఫ్ఘాన్ ప్రధాని అబ్దుల్ బరాదర్, చైనా అధ్యక్షుడు జిన్పింగ్, సింగర్, పాటల రచయిత బిల్లీ ఎలిష్, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ డీజీ ఎన్గోజీ, ఎన్విడియా సీఈఓ హువాంగ్, రచయిత కాథీ పార్క్, ప్రిన్స్ హ్యారీ-మేఘన్, జిమ్నాస్ట్ సిమోన్ బైల్స్, నటి కేట్ విన్స్లెట్ వంటి ప్రముఖులకు కూడా చోటు దక్కించుకున్నారు. టైమ్స్ జాబితాలో యునైటెడ్ స్టేట్స్ వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్, ఆసియా పసిఫిక్ పాలసీ మరియు ప్లానింగ్ కౌన్సిల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మంజూషా పి కులకర్ణి కూడా ఉన్నారు. వీరిద్దరూ భారతీయ సంతతికి చెందిన వారు.