Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రారంభించిన మోడీ
న్యూఢిల్లీ : సెంట్రల్ విస్టా ప్రాజెక్టులో భాగంగా దేశ రాజధాని ఢిల్లీలో నిర్మించిన రక్షణశాఖకు చెందిన రెండు కొత్త కార్యాలయ భవన సముదాయాలకు ప్రధాని నరేంద్ర మోడీ గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మోడీ మాట్లాడుతూ, రాజధానిలో ఆధునిక రక్షణ ఎన్క్లేవ్ను సృష్టించడంలో ఇదొక పెద్ద అడుగు అని పేర్కొన్నారు. మన భద్రతా దళాలు తమ పనిని మరింత సౌకర్యవంతంగా, సమర్థవంతంగా చేయడానికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు ఈ కొత్త భవనాలు బలం చేకూరుస్తాయని అన్నారు. ఈ భవనాల నిర్మాణానికి 24 నెలల సమయం నిర్దేశించుకోగా, 12 నెలల్లోనే రికార్డు సమయంలో పూర్తయిందని అన్నారు.