Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రూపానీ సహచరులకు మొండిచేయి
అహ్మదాబాద్ : ఊహించిన విధంగానే గుజరాత్ కొత్త క్యాబినెట్ ఏర్పాటైంది. తాజా గత ముఖ్యమంత్రి విజరురూపానీ మంత్రివర్గ సహచరుల్లో నూతన క్యాబినెట్లో ఒక్కరికి కూడా చోటుదక్కలేదు. 10 మందికి కాబినెట్ ర్యాంకుతో సహా మొత్తం 24 మంది రాష్ట్ర మంత్రులుగా గురువారం ప్రమాణస్వీకారం చేశారు. గాంధీనగర్‌లోని రాజ్‌భవన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వీరి చేత గవర్నర్ ఆచార్య దేవ్వ్రత్ ప్రమాణ స్వీకారం చేయించారు. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని గత క్యాబినెట్లో మంత్రులుగా పనిచేసిన వారిని తిరిగి తీసుకోకూడదన్న ఫార్ములాలో భాగంగా అధికార బీజేపీ ఈసారి కొత్త ముఖాలను ముందుకు తీసుకొచ్చింది. విజరు రూపానీ అనంతరం గుజరాత్ కొత్త ముఖ్యమంత్రిగా భూపేంద్ర పటేల్ ఈనెల 13న ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. భూపేంద్ర పటేల్‌తో కలిసి రాష్ట్ర క్యాబినెట్ సభ్యుల సంఖ్య మొత్తం 25కు చేరింది. రూపానీ హయాంలో స్పీకర్‌గా పనిచేసిన రాజేంద్ర త్రివేదితోపాటు బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు జతు విఘాణిలకు కొత్త క్యాబినెట్లో చోటుదక్కింది. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై పరువునష్టం కేసు వేసిన సూరత్ బీజేపీ నేత, ఎమ్మెల్యే పూర్నేష్ మోడీకి కూడా బీజేపీ మంత్రిపదవి కట్టబెట్టింది.