Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్ర మంత్రి నిర్మల అధ్యక్షతన మీటింగ్
న్యూఢిల్లీ : 45వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం నేడు (శుక్రవారం) జరగనున్నది. ఈ సమావేశానికి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షత వహించనున్నారు. ఇందులో.. నాలుగు డజన్లకు పైగా వస్తువుల పన్ను రేటును సమీక్షించడం, దానిని డిసెంబర్ 31 వరకు పొడగించడం, 11 కోవిడ్ ఔషధాలపై పన్ను తగ్గింపుతో పాటు పలు ఇతర అంశాలపై చర్చించే అవకాశం కనిపిస్తున్నది. అలాగే, జీఎస్టీ కింద పెట్రోల్, డీజీల్లపై పన్ను విధించడం, ఫుడ్ డెలివరీ యాప్స్ అయిన జొమాటో, స్విగ్గీలను రెస్టారెంట్లుగా గుర్తించడం, అవి చేసే సప్లైలపై 5 శాతం జీఎస్టీ ట్యాక్స్ విధించే ప్రతిపాదన కూడా కౌన్సిల్ చర్చించనున్నది. ఈ సమావేశం లక్నోలో జరగనున్నది. ఈ సమావేశానికి కేంద్ర సహాయ మంత్రి చౌదరీతో పాటు, రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ఆర్థిక మంత్రులు, సీనియర్ అధికారులు పాల్గొననున్నారు. ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ట్వీట్ చేసింది.