Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తిరిగి నియమించడానికి కేంద్రం అంగీకారం
న్యూఢిల్లీ : నేషనల్ కంపెనీ లా అప్పీలేట్ ట్రిబ్యునల్ (ఎన్సీఎల్ఏటీ) తాత్కాలిక చైర్‌పర్సన్‌గా జస్టిస్ ఏఐఎస్ చీమా తిరిగి నియమితులు కానున్నారు. ఈ మేరకు కేంద్రం అంగీకారం తెలిపింది. సుప్రీంకోర్టుతో కొద్దిసేపు ప్రతిష్టంభన తర్వాత కేంద్రం ఇందుకు అంగీకరించడం గమనార్హం. సెప్టెంబర్ 20న జస్టిస్ చీమా పదవీ విరమణ చేయనున్నారు. అయితే, అప్పటి వరకు ఆయనను తాత్కాలిక చైర్‌పర్సన్‌గా నియమించడానికి కేంద్రం గ్రీన్ సిగల్ ఇచ్చింది. చీమాను తిరిగి నియమించడం అనేది అతని కేసు '' విచిత్రమైన పరిస్థితులను'' పరిగణలోకి తీసుకున్న తర్వాత మాత్రమే అని కేంద్రం ఈ మేరకు స్పష్టం చేసింది. సుప్రీంకోర్టులో జరిగిన వాదనల్లో కేంద్రం తరఫున అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ వాదించారు.