Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆయనలేని సమయంలో దాడులు
న్యూఢిల్లీ : సామాజిక కార్యకర్త, రచయిత హర్ష మందర్‌కు సంబంధించిన మూడు ప్రాంగణాల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ గురువారం సోదాలు ప్రారంభించింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఢిల్లీ పోలీసు విభాగానికి చెందిన ఎకనామిక్స్ అఫెన్స్ విభాగం మనీలాండరింగ్‌కు సంబంధించి దాఖలు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా గురువారం ఉదయం 8 గంటలు నుంచి ఈడీ సోదాలు చేపట్టింది. ఢిల్లీలోని వసంత్ కుంజ్‌లోని ఆయన నివాసం, ఆయన ఆధ్వర్యంలో నడుస్తున్న స్వచ్ఛంద సంస్థ 'సెంటర్ ఫర్ ఈక్విటీ స్టడీస్' కార్యాలయంలో ఏకకాలంలో సోదాలు చేపట్టింది. అదేవిధంగా వసతి గహాలపై కూడా ఇడి అధికారులు దాడులు జరిపారు. హర్ష, ఆయన భార్య జర్మనీకి వెళ్లిన కొన్ని గంటల్లో ఈ సోదాలు జరగడం గమనార్హం. బెర్లిన్‌లోని రాబర్ట్ బాస్ అకాడమీలో ఆరు నెలల ఫెలోషిప్ నిమిత్తం ఆయన జర్మనీకి వెళ్లారు. ప్రస్తుతం ఆయన ఇంట్లో అల్లుడు, కుమార్తె ఉండగా.. వారి సమక్షంలో అధికారులు ఇంటిని జల్లెడపట్టారు. హర్ష నడుపుతున్న రెండు వసతి గృహాలకు సంబంధించిన ఆర్థిక అవకతవకలు జరిగాయ్న ఆరోపణలపై నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ (ఎన్సీపీసీఆర్) ఆదేశాల ప్రకారం ఢిల్లీ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ ఎఫ్ఐఆర్లో చీటింగ్, నమ్మక ద్రోహం, క్రిమినల్ కుట్ర వంటి అభియోగాలను మోపారు. ఈ ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ సోదాలు చేపడుతోంది. కాగా, ఈ ఆరోపణలను హర్ష కొట్టిపారేశారు. ఇవి నిరాధారమైన ఆరోపణలని పేర్కొన్నారు.