Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 2021లో భారత వృద్థి 7.2 శాతమే..!
- ఐక్యరాజ్య సమితి అంచనా
న్యూఢిల్లీ : ప్రస్తుత ఏడాదిలో భారత వృద్థి రేటు 7.2 శాతానికే పరిమితం కానుందని ఐక్యరాజ్య సమితి అంచనా వేసింది. ఆర్థిక వ్యవస్థ వేగంగా రికవరీ అవుతున్నప్పటికీ ఆహారోత్పత్తుల ధరల సూచీ, ప్రయివేటు వినిమయం ప్రతికూలతలో ఉన్నాయని 2021యూఎన్‌సీటీఏడీ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ రిపోర్ట్‌లో పేర్కొంది. ద్వితీయార్థంలో కొన్ని సవాళ్ల నుంచి దేశం బయటపడనుందని పేర్కొంది. ప్రస్తుత ఏడాదిలో ప్రపంచ దేశాల జీడీపీ 5.3 శాతం పెరగొచ్చని అంచనా వేసింది. 2020లో భారత జీడీపీ 7 శాతం క్షీణించిన విషయాన్ని గుర్తు చేసింది. ప్రస్తుత ఏడాదిలో 7.2 శాతం పెరగొచ్చని రిపోర్ట్‌లో పేర్కొంది. 2022లో 6.7 శాతం వృద్థి నమోదు కావొచ్చని తెలిపింది. వచ్చే ఏడాది ఇది తక్కువ పెరుగుదల అయినా వేగంగా పెరుగుతున్న ఆర్థిక వ్యవస్థ అని తెలిపింది. గతేడాది ద్వితీయా ర్థంలో ప్రభుత్వ వ్యయాలు పెరగడంతో 2021 మార్చితో ముగిసిన తొలి త్రైమాసికంలో భారత్ 1.9 శాతం పెరుగుదలను సాధించిందని తెలిపింది.దేశంలో ఆదాయాలు, సంపదలో తీవ్ర అంతరాలు పెరుగుతున్నాయని ఈ రిపోర్ట్ ఆందోళన వ్యక్తం చేసింది. సామాజిక అశాంతి పెరుగుతుందని హెచ్చరించింది. కరోనా సంక్షోభంలో పోయిన ఉద్యోగాలు తిరిగి భర్తీ అవుతున్నాయని తెలిపింది. ప్రయివేటు రంగ పెట్టుబడుల్లో ఇప్పటికీ మందగమనం ఉందని తెలిపింది.
9.5 శాతం వృద్థి ఉండొచ్చు : ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021-22)లో భారత జీడీపీ 9.5 శాతం పెరగొచ్చని ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ మైకెల్ దేబబ్రత పాత్ర అంచనా వేశారు. మార్చితో తొలి త్రైమాసికంలో నమోదైన 20.1శాతం వృద్థిని ఆయన గుర్తు చేశారు.సరఫరాలో నెలకొన్న అంతరాల వల్లే ద్రవ్యోల్బణం పెరిగిందని ఆర్బీఐ ఎంపీసీ భావించిందన్నారు. 2021-22 లో ద్రవ్యోల్బణం 5.7శాతంగా ఉండొచ్చన్నారు. వచ్చే ఆర్థిక సంవత్స రంలో 5శాతానికి తగ్గొచ్చన్నారు.