Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆరెంజ్ హెచ్చరికలు జారీ
- నగరంలో 57 సంవత్సరాలలో అత్యధిక వర్షపాతం నమోదు
న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలో వానలు దంచికొడుతున్నాయి. దీంతో సంవత్సరాలు రికార్డులు బ్రేక్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే భారత వాతావరణ శాఖ ఆరెంజ్ హెచ్చరికలను జారీ చేసింది. రాబోయే రోజుల్లో భారీ వర్షాలు, ఉరుములు మెరుపులతో బలమైన గాలులు సైతం వీచే అవశామందని తెలిపింది. తగిన సమయంలో సరైన చర్యలు తీసుకోవడానికి అధికార యంత్రాంగం సిద్ధంగా ఉండాలంటూ సూచించింది. గురువారం సాయంత్రం కూడా ఢిల్లీ, పరిసర ప్రాంతాల్లో ఉరుముల మెరుపులతో ఓ మోస్తారు వర్షాలు పడ్డాయి. రాజధాని పరిసర ప్రాంతాలైన ఉత్తర ప్రదేశ్‌లోని ఘజియాబాద్, మీరట్, బులంద్‌షహర్, బాగ్పట్లు, హర్యానాలోని కర్నాల్, జింద్, సోనిపట్లు ఉన్నాయి. నగరంలో సెప్టెంబర్ నెలలో రికార్డు స్థాయిలో 403 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. 1944 నుంచి నమోదైన అత్యధిక వర్షపాతం ఇదే. 417.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైన నెల తర్వాత ఇది నమోదైంది.''నోయిడా, ఫరీదాబాద్, ఢిల్లీలోని తూర్పు, మధ్య ప్రాంతాల్లో వర్షం పడిందని'' ప్రయివేటు వాతావరణ విభాగమైన స్కైమెట్ పేర్కొంది. శుక్రవారం కూడా ఢిల్లీ-ఎన్సీఆర్ పరరిధిలో వర్ష తీవ్రతలో కొంత మార్పు ఉంటుందని సంబంధిత అధికారి తెలిపారు. రానున్న రెండు రోజులు సైతం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో నగరం మరో రికార్డును సాధించే అవకాశముందని మరో అధికారి వెల్లడించారు.
ఇదిలా ఉండగా, వాయువ్య భారతంలోని పలు ప్రాంతాల్లో మరో రెండు మూడు రోజుల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశముందని ఐఎండీ పేర్కొంది. అల్పపీడన ప్రభావం కొనసాగుతోందనీ, సాధారణం నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముంది. మధ్య ప్రదేశ్ నుంచి రెండు రోజుల్లో పశ్చిమ వాయువ్య దిశగా కదిలే అవకాశముందని తెలిపింది. శుక్రవారం నాటికి ఉత్తర బంగాళాఖాతంలో తుఫాను ఏర్పడవచ్చని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో గుజరాత్, పశ్చిమ మధ్యప్రదేశ్, తూర్పు ఉత్తర ప్రదేశ్, తూర్పు రాజస్థాన్‌లలో విస్తారమైన అతి భారీ వర్షాలు పడే అవకాశముంది. శనివారంనాటికి ఒడిశా, బెంగాల్‌లలో వర్షపాతం పెరుగుతుందని ఐఎండీ తెలిపింది. కాగా, ఇప్పటికే కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఒడిశాలో అరుగురు మణించారనీ, కేవలం మూడు రోజుల్లోనే రాష్ట్రంలో 153 మిల్లీమీటర్ల వర్షం కురిసిందని అధికారులు పేర్కొన్నారు. భారీ వర్షం కారణంగా దాదాపు 2.3 మిలియన్ల మంది ప్రభావితం కాగా, ఏడుగురు గల్లంతయ్యారు. 24 జిల్లాల్లో 500 ఇండ్లు, 1.30 లక్షల హెక్టార్ల వ్యవసాయ భూమి నీటి మునిగిందని రాష్ట్ర ప్రత్యేక సహాయ కమిషనర్ ప్రదీప్ కుమార్ జెనా తెలిపారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఇప్పటికే 20,552 మంది నివాసితులను సురక్షిత ప్రాంతాలకు తరలించాయి.