Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 27న భారత్‌బంద్‌కు సన్నాహాలు..
- కలవరపడుతున్న బీజేపీ
- యూపీ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ టెన్షన్
దేశవ్యాప్తంగా 27న భారత్‌బంద్‌కు సన్నాహాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. కరోనా తర్వాత ఎన్నడూలేని విధంగా అన్ని వర్గాలు,కార్మిక,కర్షక,శ్రామిక,ప్రభుత్వ, ప్రయివేట్ అనే తేడాలేకుండా బంద్‌లో మమేకమవ్వాలని నిర్ణయించారు.మోడీ సర్కార్ అనుసరిస్తున్న ప్రజావ్యతిరేకవిధానాలపై యావత్ భారతం గళమెత్తటానికి సన్నద్ధమవుతున్నది. మరోవైపు బీజేపీ మాత్రం కలవరపడుతున్నది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కమలంపార్టీ ఘోరపరాజయాన్ని మూటకట్టుకున్నది. యూపీఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ ఉద్యమాలు ఉధృతమవుతున్నతీరు చూస్తూ..మళ్లీ పరాభవం తప్పదన్న భయం వెంటాడుతున్నది.రైతు దేశానికి అన్నంతో పాటు ఓటుబిక్ష కూడా పెడతాడు. తమ తడాఖాఎంటో చూపుతామని అన్నదాతలు మోడీ సర్కారుకు హెచ్చరిక చేస్తున్నారు.
న్యూఢిల్లీ: నల్లచట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో దీక్షలు మొదలుపెట్టి..తొమ్మిదినెలలయ్యాయి. కేంద్రం రైతులను చర్చలకు పిలిచి ఏమార్చాలనుకున్నది. వివాదాస్పద చట్టాలను రద్దు చేయడానికి మాత్రం నిరాకరిస్తున్నది. అంతేకాదు ఉద్యమాన్ని దెబ్బకొట్టేలా మోడీ ప్రభుత్వం ఎన్నో కుట్రలు చేసింది. అప్పటినుంచి అన్నదాతలు వెనక్కితగ్గలేదు. తమ ఉద్యమాన్ని ఉధృతం చేస్తూనే ఉన్నారు. ఇప్పటివరకు మూడుసార్లు బంద్‌కు పిలుపిచ్చినట్టు ఆల్ ఇండియా కిసాన్ సభ ప్రెసిడెంట్ అశోక్ ధావలే తెలిపారు. 27న తలపెట్టిన భారత్‌బంద్ వైపే అందరి దృష్టి.
మహాపంచాయత్ విజయ ఉత్సాహంతో ముందుకు
ఢిల్లీ సరిహద్దుల్లో కొనసాగుతున్న రైతుదీక్షలకు తోడుగా..దేశవ్యాప్తంగా మహాపంచాయత్‌లు ఉధృతంగా కొనసాగుతున్నాయి.తూర్పు,పడమర, ఉత్తరం,దక్షిణ ప్రాంతాలనే తేడాలేకుండా అన్నదాతలు ఉద్యమిస్తున్నారు.రైతుపోరాటాలను అణగదొక్కటానికి మోడీ ప్రభుత్వం, బీజేపీ పాలితరాష్ట్రాల్లో జలఫిరంగులు,లాఠీలతో విరుచుకుపడుతున్నాయి.రాజద్రోహం కేసులూ బనాయిస్తున్నారు.ఇలాంటి పరిస్థితుల్లో ముజఫర్‌నగర్ మహాపంచాయత్ విజయంతో రైతులు ఉత్సాహంగా కదం తొక్కుతున్నారు. దళితులు, మహిళలు, యువత, విద్యార్థులు, ముఖ్యంగా కేంద్ర కార్మిక సంఘాల మద్దతుతో సెప్టెంబర్ 27 న భారత్ బంద్‌కు సన్నద్ధమవుతున్నారు. 19 ప్రతిపక్ష రాజకీయ పార్టీలు సంఘీభావం తెలిపాయి. కేంద్రం బలవంతంగా రుద్దిన వ్యవసాయ చట్టాలు, కనీస మద్దతు ధరలతో ఆహార ధాన్యాల సేకరణ చట్టం, నాలుగు కార్మిక కోడ్ల రద్దు, అంశాలతో పాటు ...నూతన విద్యావిధానానికి వ్యతిరేకంగా ఉద్యమించనున్నట్టు అశోక్ ధావలే తెలిపారు.
మహాపంచాయత్లతో యోగికి ముచ్చెమటలు
ముజఫర్‌నగర్ మహాపం చాయత్కు పదిలక్షల మంది హాజరవ్వటంతో..యోగికి ముచ్చెమటలు పడుతున్నాయి. ఢిల్లీ దీక్షలకు వెళ్లే రైతుల ట్రాక్టర్లకు ఇంధనం నింపకుండా యూపీ సర్కార్ ఆదేశాలు జారీ చేసిన విషయం విదితమే.తాజాగా మహాపంచాయత్‌లను అడ్డంకులు కల్పిస్తున్నది. అయితే రైతులకు తోడుగా మమేకవుతున్న వర్గాలను విచ్ఛిన్నం చేసేందుకు..యోగి అబ్బాజాన్ పాలిట్రిక్స్‌ను తెరపైకి తెచ్చారు.
మతపరమైన రాజకీయాలను నమ్ముకునే యూపీలో బీజేపీ సీన్ రివర్స్ అవుతున్నదేమోనన్న భయం వెంటాడుతున్నది.
ప్రణాళికాబద్ధంగా భారత్‌బంద్..
''ఉత్తర ప్రదేశ్, బీహార్, జార్ఖండ్, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో సమావేశాలు నిర్వహించారు. స్వచ్ఛంద సేవకులు,పౌర సమాజం ఇలా ఆయా వర్గాల వారీగా బంద్ నిర్వహించటానికి ప్రణాళికాబద్ధమైన కార్యాచరణతో ముందడగువేస్తున్నారు. ఉత్తర ప్రదేశ్‌లోనే 85 కిసాన్ సంఘాలు కలిసి వచ్చాయి, బీహార్‌లోనూ 15 సంస్థలు కలిసి వచ్చాయి . సెప్టెంబర్ 20 న ముంబయిలో సన్నాహక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. తెలంగాణ,తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కేరళ వంటి దక్షిణాది రాష్ట్రాలలో ఇలాంటి సమావేశాలు ఊపందుకున్నాయి. దీంతో సంపూర్ణ భారత్ బంద్ కోసం ఎదురుచూస్తున్నాం '' అని ధావలే వివరించారు.
పిడికిలి బిగించి పోరాటం..సంయుక్త కిసాన్ మోర్చా
భారత్‌బంద్ కోసం పిడికిళ్లు బిగించి మోడీ సర్కార్‌పై పోరాటం చేస్తామని సంయుక్త కిసాన్ మోర్చా ప్రకటించింది. ఇందులో భాగంగా 15న జైపూర్‌లో కిసాన్ సంసద్ నిర్వహించనున్నారు. 17 న ఉత్తర ప్రదేశ్ లోని అన్ని జిల్లాలోనూ బంద్ ప్రణాళిక సమావేశాలు జరగనున్నాయి. పశ్చిమ ఉత్తర ప్రదేశ్‌లో రైతుల ఉద్యమం విజయవంతమైనప్పటినుంచి..ఇపుడు తూర్పు ప్రాంతానికి వేగంగా విస్తరిస్తోంది. వచ్చే ఎన్నికల్లో బీజేపీకి గుణపాఠం చెప్పడానికి రైతులు సిద్ధంగా ఉన్నట్టు కరాఖండిగా చెబుతున్నారు.
భయపడుతున్న బీజేపీ నేతలు
అధికార బీజేపీ పశ్చిమ ఉత్తర ప్రదేశ్‌లో తన స్థావరాన్ని కోల్పోవడమే కాకుండా తూర్పు యూపీలో తన మద్దతుదారులను కోల్పోయింది.ఈ ప్రాంతం రాజ్‌నాథ్ సింగ్, యోగి ఆదిత్యనాథ్, కేశవ్ ప్రసాద్ మౌర్య, మనోజ్ సిన్హాతో పాటు బీజేపీకి బలమైన కోటగా ఉన్నది. అయితే '' ప్రజల స్పందనకు భయపడి సీనియర్ బీజేపీ నేతలంతా...తమ షెడ్యూల్‌ని మార్చుకుంటున్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీకి బుద్ధిచెప్పటానికి సిద్ధంగా ఉన్నాం.
ఏఐకేఎంఎస్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆశిష్ మిట్టల్