Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- లష్కరే తోయిబా ఉగ్రవాది అబ్దుల్ కరీంను విచారించిన ఎన్ఐఎ
న్యూఢిల్లీ : బీహార్లోని దర్భంగా రైల్వే స్టేషన్లో జూన్లో జరిగిన పేలుడుకు సంబంధించి లష్కరే తోయిబా ఉగ్రవాది అబ్దుల్ కరీం తుండాను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఎ) శుక్రవారం విచారించింది. ప్రస్తుతం కరీం తుండా నిర్భంధింబడి ఉన్న డస్నా జైలు (ఉత్తరప్రదేశ్)లోనే అతన్ని ఎన్ఐఎ విచారించింది. ఉత్తరప్రదేశ్లో పిల్ఖువాకు చెందిన కరీం తుండా 1994ల్లో పాకిస్తాన్, సౌదీ అరేబియాకు పారిపోయాడు. బాంబుల తయారీలో ఆరితేరాడు. 2013 ఆగష్టు 16న భారత్-నేపాల్ సరిహద్దుల్లో ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. దర్భంగా పేలుడు కేసులో ఇక్బాల్ ఖాన్ అనే వ్యక్తిని ఇప్పటికే అరెస్టు చేశారు. ఇక్బాల్ ఖాన్కు కరీంకు 2009 నుంచే పరిచయం ఉందని, కరీం వద్దే ఇక్బాల్ బాంబులు తయారీ నేర్చుకున్నట్లు వెల్లడికావడంతో మరిన్ని వివరాల కోసం ఈ విచారణ జరిగింది.