Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎస్సిఓ సమావేశంలో మోడీ
న్యూఢిల్లీ : ఆఫ్ఘనిస్తాన్లో ప్రస్తుతం చోటుచేసుకుంటున్న పరిణామాలు మతపరమైన తీవ్రవాద (రాడికలైజేషన్) సమస్యను ముందుకు తెస్తున్నాయని ప్రధాని మోడీ అన్నారు షాంఘై సహకార సంస్థ (ఎస్సిఓ) సభ్యుల మధ్య విశ్వాసాన్ని పెంపొందించేందుకు ఈ రాడికలైజేషన్పై పోరాటం చేయాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. ఎస్సిఓ కౌన్సిల్ ఆఫ హెడ్స్ 21వ సమావేశాన్ని ఉద్దేశించి మోడీ శుక్రవారం ఆన్లైన్ ద్వారా ప్రసంగించారు. ఈ ప్రాంతంలో శాంతి, భద్రత, విశ్వాసపరంగా ఎదురౌతున్న సవాళ్లకు రాడికలైజేషనే ప్రధాన కారణమని ఆయన పేర్కొన్నారు. ఆఫ్ఘనిస్తాన్లో ఇటీవలి పరిణామాలు ఈ సవాలును మరింత ముందుకు తెస్తోందని, ఈ సమస్యను ఎదుర్కొనేందుకు ఎస్సిఓ తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని మోడీ అన్నారు. మధ్య ఆసియాలో మితవాద ఇస్లాం ప్రాముఖ్యతను మోడీ ఈ సందర్భంగా నొక్కిచెప్పారు. చారిత్రాత్మకంగా ఈ ప్రాంతం ప్రగతిశీల, మితవాద సాంస్కృతిక సంప్రదాయాల కోటగా ఉందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో మత తీవ్రవాదం, రాడికలైజేషన్ను ఎదుర్కోవాలని సభ్యదేశాలను కోరారు. ఈ ఏడాది ఎస్సిఓ సమావేశాన్ని తజకిస్తాన్ నిర్వహిస్తోంది. ఈ షాంఘై సహకార సంస్థలో కొత్తగా సభ్యత్వం పొందిన ఇరాన్ను మోడీ ఈ సందర్భంగా సాదరంగా స్వాగతించారు. ప్రాంతీయ సంస్థ కొత్త చర్చా భాగస్వాములుగా సౌదీ అరేబియా, ఈజిప్టు, ఖతార్లను చేర్చడాన్ని ఆయన ప్రశంసించారు.