Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : ప్రధాని మోడీ జన్మదినం సందర్భంగా రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, టిబెట్ అధిపతి దలైలామ, కేంద్ర హోం మంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ శుభాకాంక్షలు తెలిపారు. శుక్రవారం ప్రధాని మోడీ 71వ వసంతంలోకి ప్రవేశించారు. ప్రధాని మోడీ సుదీర్ఘంగా, ఆరోగ్యంగా జీవించాలని రాష్ట్రపతి కోరుకున్నారు. నిరంతర సేవా స్ఫూర్తితో దేశానికి సేవ చేయాలని ఆకాంక్షించారు. 'హ్యాపీ బర్త్ డే, మోడీ జీ' అని రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. మోడీకి శుభాకాంక్షలు చెబుతూ దలైలామా ప్రత్యేకంగా లేఖ రాసారు. కోవిడ్ మహమ్మారి వంటి సవాళ్లు ఎదురవుతున్నప్పటికీ పెరుగుతున్న ఆత్మవిశ్వాసంతో మోడీ సేవ కొనసాగిస్తున్నారని దలైలామా ప్రశంసించారు. జన్మదినం సందర్భంగా మోడీని అమిత్ షా ప్రశంసలతో ముంచెత్తారు. అనేక దశాబ్దాలుగా హక్కులు కోల్పోయిన వారికి మోడీ గౌరవ ప్రదమైన జీవితాన్ని అందించారని, వారిని ప్రధాన అభివృద్ధి స్రవంతిలోకి తీసుకునివచ్చారని కొనియాడారు. అభివృద్ధి, సుపరిపాలనలో మోడీ కొత్త అధ్యాయాలు లిఖించారని రాజ్‌నాథ్ సింగ్ పేర్కొన్నారు.
భవానికి కత్తికి రూ 10 కోట్లు
ప్రధాని మోడీ జన్మదినం సందర్భంగా వివిధ సందర్భాలు, పర్యటనల్లో ఆయనకు బహుమతులుగా అందిన వస్తువులను కేంద్ర సాంస్కృతిక శాఖ శుక్రవారం ఈ-వేలాన్ని ప్రారంభించింది. వచ్చే నెల 7వ తేదీ వరకూ ఇది కొనసాగుతోంది. ఈ వేలంలో ఫెన్సర్ భవానీ దేవి టోక్యో ఒలింపిక్స్‌లో ఉపయోగించిన కత్తి(ఫెన్స్)కి ఇప్పటికే బిడ్ ధర రూ.10కోట్లకు చేరింది.
టోక్యో ఒలింపిక్స్‌లో భారత్ తరఫున ఫెన్సింగ్‌లో పాల్గొని ఈ క్రీడల్లో పాల్గొన్న మొట్టమొదటి భారత మహిళగా చరిత్ర సష్టించింది ఫెన్సర్ భవానీదేవి. పతకం సాధించకపోయినా ప్రదర్శనతో ఆకట్టుకుంది. అలాగే, పారాలింపిక్స్‌లో స్వర్ణపతకం అందుకున్న షట్లర్ కష్ణ నాగర్ ఉపయోగించిన రాకెట్ ధర కూడా రూ.10కోట్లకు చేరింది. పారాలింపిక్స్‌లో రజతం సాధించిన మరో షట్లర్ సుహాస్ యతిరాజ్ రాకెట్ ప్రస్తుతం రూ.10కోట్లతో కొనసాగుతోంది.
అలాగే ఒలింపిక్స్‌లో దేశానికి తొలి స్వర్ణం అందించిన జావెలిన్ త్రో ఆటగాడు నీరజ్ చోప్రా ఉపయోగించిన ఈటెను రూ.కోటి బేస్ ధరతో వేలానికి పెట్టగా.. ప్రస్తుతం రూ.1.20కోట్లతో కొనసాగుతోంది. ఒలింపిక్స్‌లో వరుసగా రెండు పతకాలు సాధించిన ఏకైక మహిళగా చరిత్ర సష్టించిన పివి సింధు రాకెట్‌కు రూ.80లక్షల బేస్‌ధరతో వేలం నిర్వహిస్తుండగా.. ప్రస్తుతం దాని ధర రూ.90లక్షలు దాటింది. టోక్యో ఒలింపిక్స్‌లో బాక్సింగ్ సంచలనం లవ్లీనా బోర్గొహేన్ చేతి గ్లౌజులను రూ. 80లక్షలతో వేలం ప్రారంభించగా.. ప్రస్తుత ధర రూ.1.80కోట్లుగా ఉంది. ఈ వేలం కార్యక్రమం ద్వారా సమకూరిన నిధులను గంగా నది ప్రక్షాళన కోసం చేపట్టిన నమామి గంగే కార్యక్రమం కోసం వ్యయం చేయనున్నట్లు సమాచారం.