Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : జమ్మూకాశ్మీర్లో ప్రభుత్వ ఉద్యోగులపై నిఘా పెట్టాలంటూ ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి. అంతేకాదు ప్రభుత్వ వ్యతిరేక చర్యలకు పాల్పడ్డాడనే అనుమానాలుంటే వారిపై 'వెరిఫికేషన్ ప్రక్రియ' చేపట్టాలని కేంద్రం తాజాగా నోటిఫికేషన్ జారీచేసింది. సంబంధిత ఉద్యోగిని విధుల్లో నుంచి తొలగించాలని స్క్రీనింగ్ కమిటీ తేల్చితే దానిని అమలుజేయాలని రాష్ట్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల ఉన్నతాధికారులకు కేంద్రం ఆదేశాలు జారీచేసింది. వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగుల బ్యాక్గ్రౌండ్, వారి కదలికల గురించి తరుచూ చెక్ చేయాలని ఆదేశాలు వెలువడటం చర్చనీయాంశమైంది.