Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- న్యాయ విచారణ సంక్లిష్టం కారాదు..
- ఇప్పటి జనాభా అవసరాలు తీర్చే విధంగా ఉండాలి : సీజేఐ ఎన్.వి.రమణ
న్యూఢిల్లీ : మన న్యాయవ్యవస్థలో కీలకమైన మార్పులు రావాల్సిన తరుణం ఆసన్నమైందని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ అభిప్రాయపడ్డారు. మనదేశానికి అనుగుణమైన న్యాయవ్యవస్థను రూపొందించుకోవాలని, న్యాయ విచారణ అత్యంత ప్రభావవంతగా ఉండాలని ఆయన అన్నారు. న్యాయ విచారణ అందరికీ అందుబాటులో ఉండేవిధంగా, ఆమోదయోగ్యంగా మార్చాలని చెప్పారు. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ మోహన్ ఎం.శంతన్గౌడర్ సేవలకు నివాళి అర్పిస్తూ శనివారం బెంగుళూరులో నిర్వహించిన ఒక కార్యక్రమంలో సీజేఐ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన ఏమన్నారంటే..''సాధారణ ప్రజలకు మన న్యాయవ్యవస్థలో అనేక అడ్డంకులున్నాయి. కోర్టుల పని విధానం మారాలి. మన వ్యవస్థలు, అందులోని విధానాలు, నిబంధనలు ఎప్పుడో బ్రిటీష్ కాలంనాటివి. ఇవి ప్రస్తుతం భారతీయ జనాభాకు అనుగుణంగా లేవు. కాబట్టి..మనదేశానికి అనుగుణంగా న్యాయవ్యవస్థలో మార్పులు తేవాలి. ఉదాహరణకు..న్యాయస్థానాలు సుదీర్ఘమైన తీర్పులు వెలువరుస్తున్నాయి. దీనిని అర్థం చేసుకోవడానికి పిటిషనర్లు మరింత డబ్బును వ్యయం చేయాల్సి వస్తోంది. ఫిర్యాదుదారుడ్ని, పిటిషనర్లను దృష్టిలో పెట్టుకొవాలి. న్యాయ విచారణ సులభతరంగా, పారదర్శకంగా ఉండాలి'' అని చెప్పారు.