Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఈశాన్య రాష్ట్రాలపై ఎన్సీఆర్బీ నివేదిక
అగర్తల : బీజేపీ అధికారంలోకి రాకముందు వరకూ ప్రశాంతంగా ఉన్న త్రిపుర రాష్ట్రంలో ప్రస్తుతం హింస చెలరేగుతోంది. ఈశాన్య రాష్ట్రాల్లో రాజకీయ హింసాకాండలో త్రిపుర అగ్రస్థానంలో ఉంది. రాజకీయ ఘర్షణలతో పాటు త్రిపు రలో నేరపూరిత హత్యలు, దేశద్రోహం, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నేరాలు, డబ్బు ల కోసం కిడ్నాపింగ్, అక్రమంగా నిర్భంధించడం, మానవ అక్రమ రవాణ వంటి కేసులు కూడా గణనీయంగా పెరిగాయి. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్సీఆర్బీ) క్రైమ్ ఇన్ ఇండియా 2020 నివేదిక ఈ విషయాన్ని వెల్లడిస్తుంది. త్రిపురలో ప్రతీ లక్ష ప్రజల్లో 0.5 శాతంపై రాజకీయ దాడులు జరగాయి. ఈ తరువాత అరుణాచల్‌ప్రదేశ్ 0.1 శాతంపై దాడులు జరగ్గా, మూడో స్థానంలో మణిపూర్ ఉంది. ఈ మూడు రాష్ట్రాలు మినహా మరే ఇతర ఈశాన్యరాష్ట్రంలోనూ గత ఏడాదిలో రాజకీయ ఘర్షణలు జరగకపోవడం విశేషం. ఈ నివేదిక ప్రకారం 2020లో త్రిపురలో 22 రాజకీయ ఘర్షణల కేసులు నమోదయ్యాయి. అయితే ప్రజా ప్రశాంతకు వ్యతిరేకంగా అల్లర్లు కేసులు అస్సాంలో 829 కేసులు నమోదయ్యాయి. త్రిపురలో ఇలాంటి కేసులు 83, మణిపూర్‌లో 60, అరుణాచల్ ప్రదేశ్‌లో 10 కేసులు నమోదయ్యాయి. మతపరమైన అల్లర్లు కేసులు అస్సాంలో అత్యధికంగా 17 కేసులు నమోదయ్యాయి.
అసోంలో అత్యధికంగా హత్యకేసులు 1,131 నమోదు కాగా, త్రిపురలో 114 హత్యకేసులు నమోదయ్యాయి. వైద్య నిర్లక్ష్యం కేసులు అస్సాంలో తొమ్మిది, త్రిపురలో రెండు కేసులు నమోదయ్యాయి. హత్యాయత్నాం కేసులు అస్సాంలో 1,316 కేసులు, త్రిపురలో 117 కేసులు నమోదయ్యాయి. ఇక, ఎన్సీఆర్బీ నివేదిక ప్రకారం ఈశాన్య రాష్ట్రాల్లో లైంగికదాడి కేసులు అధికంగా అసోంలో 1,657 కేసులు నమోదయ్యాయి. త్రిపురలో 79 కేసులు నమోదయ్యాయి. మేఘాలయలో 67 కేసులు నమోదయ్యాయి. అలాగే కిడ్నాపింగ్, అపహరణ కేసులు త్రిపురలో 127 కేసులు నమోదు కాగా, అసోంలో 6934 కేసులు నమోదయ్యాయి.