Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పెరుగుతున్న కరోనా మరణాలు
- 24 గంటల్లో 30,773 మందికి పాజిటివ్.. 309 మంది మృతి
పండుగల దృష్ట్యా అప్రమత్తంగా ఉండాలని వైద్యనిపుణులు హెచ్చరికల్ని..జనం బేఖాతరు చేస్తున్నారు. దీంతో కరోనా డేంజర్‌బెల్స్ మళ్లీ మోగుతున్నాయి. గత 24 గంటల్లో 309 మంది కోవిడ్ బారిన పడి చనిపోగా..30,773 కేసులు నమోదయ్యాయి. దేశంలో మొత్తం కరోనా వైరస్ సంక్రమణ కేసుల సంఖ్య 3,34,48,163 కి పెరిగింది, మరణించిన వారి సంఖ్య 4,44,838 కి చేరింది. ఇక ప్రపంచంలో 22.81 కోట్లకు పైగా సంక్రమణ కేసులు నమోదుకాగా.. ఇప్పటివరకు 46.86 లక్షల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. అయితే అనధికారికంగా ఈ సంఖ్య రెట్టింపుగా ఉంటుందని వైద్యవర్గాలు అంటున్నాయి.
న్యూఢిల్లీ: దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 3,32,158 కి తగ్గిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ డేటా వెల్లడించింది. అయితే కరోనా కాస్త నెమ్మదించినట్టు గ్రాఫ్ కనిపించినా..చాపకింద నీరులా మహమ్మారి విజృంభిస్తున్నది. కోవిడ్ మరణాల సంఖ్యకూడా పెరుగుతున్న తీరుపై సర్వత్రా ఆందోళనవ్యక్తమవుతున్నది. జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ ఆఫ్ అమెరికా విడుదల చేసిన డేటా ప్రకారం ప్రపంచవ్యాప్తంగా మొత్తం కరోనా వైరస్ కేసులు 22,81,83,102 కి పెరిగాయి. ఇప్పటివరకు 46,86,536 మంది ప్రాణాలు కోల్పోయారు.
చికిత్స పొందుతున్న రోగుల సంఖ్య మొత్తం సోకిన వారి సంఖ్యలో 0.99 శాతం కాగా, కోవిడ్ -19 నుంచి కోలుకునే రేటు 97.68 శాతంగా నమోదైందని మంత్రిత్వ శాఖ తెలిపింది. గత 24 గంటల్లో, కోవిడ్ -19 కోసం చికిత్స పొందుతున్న రోగుల సంఖ్య 8,481 తగ్గింది.
దేశంలో ఇప్పటివరకు మొత్తం 55,23,40,168 నమూనాలను కోవిడ్-19 కోసం పరీక్షించారు. శనివారం.. 15,59,895 నమూనాలను పరీక్షించారు. డేటా ప్రకారం.. రోజువారీ ఇన్ఫెక్షన్ రేటు 1.97 శాతంగా నమోదైంది. గత ఇరవై రోజులుగా ఇది మూడు శాతం కంటే తక్కువగా ఉన్నది. వీక్లీ ఇన్ఫెక్షన్ రేటు 2.04 శాతంగా ఉన్నది. గత 86 రోజులుగా ఇది మూడు శాతం కంటే తక్కువగా ఉన్నట్టు అధికారిక గణాంకాలు ధ్రువీకరిస్తున్నాయి. కాగా కరోనా బారినపడి కోలుకున్నవారి సంఖ్య 3,26,71,167 కాగా, మరణాల రేటు 1.33 శాతంగా నమోదైంది.
దేశంలో దేశవ్యాప్త టీకా ప్రచారం కింద ఇప్పటివరకు 80.43 కోట్లకు పైగా మోతాదులు ఇచ్చినట్టు కేంద్రం తెలిపింది. గత 24 గంటల్లో 309 కొత్త మరణాల కేసులలో, కేరళలో 143 మంది కరోనా సోకి చనిపోగా, మహారాష్ట్రలో 80 మంది మరణించారు.
మహారాష్ట్రలో మరణాలెక్కువ..
దేశంలో కోవిడ్ -19 కారణంగా ఇప్పటివరకు 4,44,838 మంది మరణించారు. మహారాష్ట్రలో 1,38,469 మంది, కర్నాటకలో 37,587, తమిళనాడులో 35,310, ఢిల్లీలో 25,085, కేరళలో 23,439, ఉత్తరప్రదేశ్‌లో 22,887, పశ్చిమ బెంగాల్లో 18,641 మంది మరణించారు. ఈ రోగులలో 70 శాతం మంది ఒకటి కంటే ఎక్కువ మంది ఇతర వ్యాధుల కారణంగా మరణించారని కేంద్ర మంత్రిత్వ శాఖ తెలిపింది.డేటా ప్రకారం దేశవ్యాప్తంగా 110 రోజుల్లో లక్ష కోవిడ్ -19 కేసులు నమోదయ్యాయి కేవలం 59 రోజుల్లో అవి 10 లక్షలు దాటాయి.