Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏపీ పరిషత్ పోరులో వైసీపీి హవా
- అన్ని జిల్లా పరిషత్‌లు కైవసం
- టీడీపీకి 6 జడ్పీటీసీ, 809 ఎంపీటీసీలు
- ఒక జడ్పీటీసీ, 17 ఎంపీటీసీిల్లో సీపీఐ(ఎం) గెలుపు
అమరావతి : పరిషత్ ఎన్నికల్లో ఏకపక్ష ఫలితాలు వచ్చాయి. ఆదివారం ఉదయం కౌంటింగ్ ప్రారంభమైన తరువాత వెలువడిన ఫలితాల్లో రాష్ట్రమంతా వైసీపీ హవా కొనసాగింది. జడ్పీటీసీలతో పాటు, ఎంపిటిసి ల్లోనూ మెజార్టీ స్థానాల్లో వైసీపీ అభ్యర్థులు విజయం సాధించారు. ఏకపక్ష ఫలితాలతో రాష్ట్రంలోని అన్ని జిల్లా పరిషత్‌లను వైసీపీ కైవసం చేసుకోనుంది. ప్రధాన ప్రతి పక్షం తెలుగుదేశం పార్టీ నామమాత్రపు ప్రభావాన్నే చూ పింది. పోలింగ్‌కు ముందు ఆ పార్టీ ఎన్నికలను బహి ష్కరిస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. కడపటి వార్తలు అందే సమయానికి వైసీపీ 462 జడ్పిటిసి స్థానాలనూ, 5,916 ఎంపిటిసి స్థానాలను కైవసం చేసు కుంది. టిడిపి ఆరు జడ్పిటిసిల్లోనూ, 809 ఎంపిటిసి ల్లోనూ గెలుపొందింది. సీపీఐ(ఎం) విశాఖ జిల్లాలోని అనంతగిరి జడ్పిటిసితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా 17 ఎం పిటిసి స్థానాల్లో విజయం సాధించింది. వీటిలో రెండు ఏకగ్రీవ మైనవి ఉన్నాయి. ఇవి కాకుండా విజయనగరం జిల్లాల్లో స్వతంత్రులుగా పోటీ చేసిన ఆ పార్టీ అభ్యర్థులు మరో ఇద్దరు గెలుపొందారు. పశ్చిమగోదావరి జిల్లాలో జనసేన ఒక జడ్పిటిసి స్థానాన్ని గెలుపొందింది.
జడ్పిటిసిల్లో ఇలా...
రాష్ట్ర వ్యాప్తంగా 660 జడ్పిటిసి స్థానాలకు గానూ 126 స్థానాలు ఏకగ్రీవమైనాయి. జడ్పిటిసి ఎన్నికల బరిలోకి దిగి నామినేషన్లు దాఖలు చేసిన తరువాత అభ్యర్థులు మృతి చెందడంతో 11 స్థానాల్లో ఎన్నికలు వాయిదా పడ్డాయి. మరో 8 స్థానాల్లో వివిధ కారణాలతో ఫలితాలు ప్రకటించ లేదు. 515 స్థానాలకు ఎన్నికలు జరగగా, 462 స్థానాలను వైసిపి గెలుచుకుంది. నెల్లూరు, చిత్తూరు. కర్నూలు, విజయనగరం జిల్లాల్లో ఆ పార్టీ క్లీన్ స్వీప్ చేసింది. ఏకగ్రీవాలతో కలిపి, ఈ జిల్లాల్లో అన్ని జడ్ పిటిసి స్థానాల్లోనూ వైసీపీి అభ్యర్థులు గెలుపొందారు. తెలుగుదేశం పార్టీకి విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, కడప, అనంతపురం జిల్లాల్లో ఒక్కో స్థానం లభించింది. మొత్తంమీద ఆ పార్టీకి ఆరు జడ్పిటిసి స్థానాలు దక్కాయి. . సీపీఐ(ఎం) ఒక స్థానంలో గెలుపొందింది. కడప జిల్లాల్లోని రెండు జడ్పిటిసి స్థానాల్లోని రెండు పోలింగ్ బూత్‌లలో బ్యాలెట్‌పేపర్లు నీటితో తడిసిపోవడంతో ఫలితాలను నిలిపివేసి, ఏం చేయాలన్న దానిపై ఎస్ఇసికి నివేదించారు. అన్ని జిల్లాల్లోనూ అత్యధిక జడ్పిటిసి స్థానాలను వైసిపి గెలుచుకుంది. దీంతో అన్ని జిల్లా పరిషత్‌లు ఆ పార్టీ ఆధీనంలోకి వెళ్లాయి.
ఎంపిటిసిల్లోనూ ఫ్యాను జోరు
మొత్తం 10,047 ఎంపిటిసి స్థానాలకుగానూ 2371 స్థానాలు ఏకగ్రీవమైనాయి. 7,219 చోట్ల ఎన్నికలు జరిగాయి. వీటిలో 5,916 స్థానాల్లో వైసీపీ విజయం సాధించింది. టిడిపికి 809 స్థానాలు దక్కాయి. జనసేన 164 ఎంపీటీసీి స్థానాల్లో గెలుపొందింది. సీపీఐ(ఎం) ఏకగ్రీవాలతో కలిపి 17 స్థానాల్లో, సీపీఐ 8 స్థానాల్లో గెలుపొందాయి. జనసేనతో పొత్తుపెట్టుకుని ఎన్నికల బరిలోకి దిగిన బీజేపీకి 27 ఎంపిటిసి స్థానాలు దక్కగా, కాంగ్రెస్ 3 చోట్ల గెలుపొందింది. స్వతంత్రులు 156 ఎంపిటిసి స్థానాల్లో గెలుపొందారు.
అందరి దీవెనల వల్లే..
దేవుడి దయ అందరి దీవెనవల్లే అఖండ విజయం సాధ్యమైంది. ప్రజలు చూపించిన ప్రేమ అభిమానాలు 'రాష్ట్రంలో ప్రతి కుటుంబం పట్ల, ప్రతి మనిషిపట్ల నా బాధ్యతను పెంచాయి. పూర్తిస్థాయిలో ఫలితాలు వచ్చిన అనంతరం మరోసారి రాష్ట్ర ప్రజలకు వీడియో సందేశం ద్వారా ధన్యవాదాలు తెలుపుకుంటాను.
ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ట్వీట్
బోగస్ ఫలితాలు
ఇవి బోగస్ ఫలితాలు. ఎన్నికల్లో వైసిపి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసింది. కనీసం నామినేషన్లు కూడా వేయనీయకుండా అడ్డుకుంది. అందువల్లే మేము బహిష్కరించాం. ఈ ఎన్నికలు ప్రజాభిప్రాయం కాదు.
- అచ్చెన్నాయుడు, టిడిపి రాష్ట్ర అధ్యక్షులు
ప్రశాంతంగా 'ప్రాదేశిక' కౌంటింగ్
- తడిచిన, చెద పట్టిన బ్యాలెట్ పేపర్లు
- 2 చోట్ల ఆగిన కౌంటింగ్
- మరో రెండు చోట్ల ఫలితాలు నిలుపుదల
ఎవరికి ఎన్ని...
జడ్పిటిసిలు
మొత్తం స్థానాలు 660
ఏకగ్రీవం 126
ఎన్నికలు జరిగినవి 515
వైసిపి 462
టిడిపి 6
సిపిఎం 1
జనసేన 1
స్వతంత్రులు 1
ఎంపిటిసిలు
మొత్తం స్థానాలు 10,047
ఏకగ్రీవం 2,371
ఎన్నికలు జరిగినవి 7,219
వైసిపి 5,916
టిడిపి 809
సిపిఎం 15
సిపిఐ 8ఇతరులు 180