Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నరేంద్రగిరి మహారాజ్ సూసైడ్ నోట్ గుర్తింపు
లక్నో: దేశంలోనే అతిపెద్ద ఆశ్రమాల్లో ఒకటైన అఖిల భారతీయ అఖాడ పరిషత్ అధిపతి నరేంద్రగిరి మహారాజ్ అనుమానాస్పదంగా మృతిచెందారు. ఉత్తర్‌ప్రదేశ్ ప్రయాగ్‌రాజ్‌లో ఉన్న బాఘంబరి మఠంలో నరేంద్రగిరి ఆయన పార్థివ దేహాన్ని స్వాధీనం చేసుకున్నట్లు యూపీ పోలీసులు వెల్లడించారు. ఓ సూసైడ్ నోట్‌ను కూడా స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. 'సూసైడ్ నోట్‌ను పరిశీలిస్తున్నాం. పలు కారణాలతో ఆయన మనస్తాపం చెందినట్టు లేఖలో రాశారని ప్రయాగ్‌రాజ్ పోలీస్ చీఫ్ కేపీ సింగ్ వెల్లడించారు. అయితే శిష్యునితో ఉన్న వివాదాలకారణంగానే..ఆయన ఉరేసుకుని చనిపోయినట్టు పరిషత్ సభ్యులు అంటున్నారు.