Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చెన్నయ్ : ప్రభుత్వ పాఠశాలల్లో ఆరవ తరగతి నుండి 12వ తరగతి వరకు చదివిన విద్యార్థులకు ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫిషరీస్, వెటర్నరీ కోర్సుల్లో 7.5 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తూ తమిళనాడు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ ఆదివారం నాడు అన్నా యూనివర్సిటీలో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొని ఈ మేరకు 50 మంది విద్యార్థులకు అడ్మిషన్ పత్రాలు స్వయంగా అందజేశారు. ఎంబిబిఎస్, బిడిఎస్ కోర్సుల్లో సైతం ఈ రిజర్వేషన్లు అమలు చేస్తామని ఆయన ప్రకటించారు. ఆన్లైన్ ద్వారా మొత్తం 1,39,330 మంది ఇంజినీరింగ్ కోర్సుల్లో అర్హత సాధించగా, 15,660 మంది విద్యార్థులు ప్రభుత్వ స్కూల్లో చదవడం ద్వారా రిజర్వేషన్లు పొందారు. ఈ రిజర్వేషన్ల ద్వారా చేరిన విద్యార్థుల ఫీజులు, హాస్టల్ ఫీజులు మొత్తం ప్రభుత్వమే భరిస్తుందని ఆయన ప్రకటించారు. దీని ద్వారా ఈ విద్యాసంవత్సరం ఇంజనీరింగ్లో చేరే 10 వేల మందితో పాటు అగ్రికల్చర్, ఫిషరీ, లా వంటి ఇతర ప్రొఫెషనల్ కోర్సుల్లో అడ్మిషన్లు పొందే మరో 350 మందికి లబ్ధి చేకూరుతుందని అన్నారు.