Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 17 ఏండ్ల బాలికపై సామూహిక లైంగికదాడి
- ఆన్లైన్లో వీడియో షేర్.. నిందితులపై కేసు నమోదు
లక్నో: దేశంలో మహిళలకు రక్షణ లేకుండా పోతున్నది. నిత్యం ఏదోఒక చోట వారిపై అఘాయిత్యాలు చోటుచేసుకుంటూనే ఉన్నాయి. తాజాగా బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్లో మరో దారుణం చోటుచేసుకుంది. 17 ఏండ్ల బాలికపై ఇద్దరు వ్యక్తులు సామూహిక లైంగికదాడికి పాల్పడ్డారు. అంతటితో ఆగకుండా ఈ ఘటనను వీడియోతీసి.. దానిని సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఈ దారుణం ముజఫర్ నగర్లోని భోపాల్ పోలీసు స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. తాజాగా సంబంధిత వీడియో వైరల్ కావడంతో విషయం తెలుసుకున్న పోలీసులు నిందితులపై కేసు నమోదుచేశారు. ఈ ఘటనపై భోపాల్ పోలీసు స్టేషన్ హౌస్ ఆఫీసర్ (ఎస్ఎV్ావో) సుభాష్ బాబు మాట్లాడుతూ.. బాలికపై లైంగికదాడి, సంబంధిత వీడియోను సోషల్ మీడియలో షేర్ చేశారు. పరారీలో ఉన్న ఇద్దరు నిందితులు శుభమ్, ఆశిష్లపై కేసు నమోదుచేసినట్టు తెలిపారు. బాధితురాలి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదుచేశారు. బాలికకు పండ్లు ఇస్తామనే సాకుతో జామతోటలోకి తీసుకెళ్లిన అనంతరం అక్కడ లైంగికదాడికి పాల్పడ్డారు. ఈ ఘటనను మొబైల్ ఫోన్లో చిత్రీకరించారు. ఆ వీడియోను సోషల్ మీడియలో షేర్ చేయడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది.
ఇదిలావుండగా, రాష్ట్రంలోని కొత్వాలీ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గ్రామంలో ఒక మహిళపై ఓ వ్యక్తి లైంగికదాడికి యత్నించాడు. నిందితుడు బాబీ తన పొలంలో పనిచేయడానికి వచ్చిన ఓ మహిళపై లైంగికదాడికి యత్నించాడు. అయితే, ఆమె గట్టిగ అరవడంతో ఆ దుండగుడు పారిపోయాడు. ఈ ఘటనపై కేసు నమోదుచేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.