Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎన్డీయేలో మహిళా అభ్యర్థుల చేరికపై సుప్రీంకోర్టుకు తెలిపిన కేంద్రం
న్యూఢిల్లీ : నేషనల్ ఢిఫెన్స్ అకాడమీ (ఎన్డీయే) పరీక్షల్లో మహిళా అభ్యర్థులూ పాల్గొనేలా రంగం సిద్ధమవుతున్నది. దీనికి కావాల్సిన ప్రక్రియ జరుగుతున్నది. 2022 మే నాటికి ఇదంతా పూర్తి కానున్నది. ఈ మేరకు దేశ సర్వోన్నత న్యాయస్థానానికి కేంద్రం వెల్లడించింది. ఎన్డీయే నిర్వహించే పరీక్షల్లో మహిళా అభ్యర్థులూ హాజరయ్యేలా అనుమతి కోరుతూ లాయర్ కుష్ కల్రా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇది మహిళల పట్ల వివక్ష చూపడమేననీ, వారికీ అవకాశం కల్పించాలని తన పిటిషన్లో కుష్ కల్రా కోరారు.ఆయన దాఖలు చేసిన పిటిషన్‌పై న్యాయ స్థానం విచారణ జరిపింది.దీనికి స్పందనగా కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ ఒక అఫిడవిట్‌ను అత్యున్నత న్యాయస్థానానికి సమర్పించింది. న్యాయమూర్తులు సంజరు కిషన్ కౌల్, హృషికేశ్ రారు లతో కూడిన ధర్మాసనానికి దీనిని అందించింది. ఎన్డీయేలో మహిళా కేడెట్ల కోసం ఒక కరిక్యులమ్‌ను రూపొందించడానికి నిపుణులతో కూడిన అధ్యయన కమిటీని ఏర్పాటు చేసినట్టు కేంద్రం తన అఫిడవిట్లో పేర్కొన్నది.