Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : టెలిగ్రామ్ మెసెంజర్ తాజాగా లైవ్‌స్ట్రీమ్ రికార్డింగ్ సౌకర్యాన్ని ప్రారంభించింది. ఆడియో, వీడియో ఫార్మాట్లలో ఈ సౌకర్యాన్ని ఖాతాదారులు ఉపయోగించుకోవచ్చు. లైవ్‌స్ట్రీమ్ సౌకర్యాన్ని గత నెలలో ప్రారంభించిన టెలిగ్రామ్ తాజాగా ఈ రికార్డింగ్ సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చినట్లు ఒక ప్రకటనలో తెలిపింది. అలాగే గ్రూపుల్లోని 'రీడ్ రిసీప్డ్'లకు మరిన్ని ఫీచర్లను టెలిగ్రామ్ జోడించింది. దీని ప్రకారం ఇతర గ్రూపు సభ్యులు మెసేజ్‌ను ఎప్పుడు చదివారో తెలుసుకోవచ్చు. అయితే మెసేజ్ పంపిన ఏడు రోజుల తరువాత వరకే ఈ ఫీచర్ అందుబాటులో ఉంటుంది. అదేవిధంగా కొత్తగా ఛాట్ థీమ్స్‌ను కూడా అందుబాటులోకి టెలిగ్రామ్ తీసుకుని వచ్చింది. వీటిలో రంగురంగుల బుడగలు, యూనిమేటెడ్ బ్యాక్గ్రౌండ్స్, ఇంటరాక్టివ్ ఎమోజీలు ఉన్నాయి. కాగా, సెన్సార్ టవర్ డేటా ప్రకారం గత నెలలో టెలిగ్రామ్ యాప్స్‌ల డౌన్లౌడ్లు సంఖ్య ఒక బిలియన్లను దాటింది.