Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మహిళా వ్యాపారవేత్తల నైపుణ్యాభివద్ధికి కృషి
న్యూఢిల్లీ : డిజిటల్ నైపుణ్యాలు, ఆర్ధిక అక్షరాస్యతతో మహిళా వ్యాపారవేత్తల నైపుణ్యాభివద్ధికి వీలుగా డిజిటల్ చెల్లింపుల సంస్థ వీసా, నాస్కామ్ ఫౌండేషన్లు జట్టు కట్టాయి. ఈ కార్యక్రమాన్ని మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, కర్నాటక, తెలంగాణా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల వ్యాప్తంగా వీసా ప్రారంభించినట్టు పేర్కొంది. గతేడాది 5 కోట్ల మంది చిరు, సూక్ష్మ వ్యాపార సంస్ధల వద్ధి కోసం సంస్థ ప్రకటించిన అంతర్జాతీయ రికవరీ ప్రయత్నాలలో ఇది ఓ భాగమని తెలిపింది. ఈ శిక్షణా కార్యక్రమాన్ని పేదవర్గాలకు చెందిన మహిళలకు సహాయపడే రీతిలో రూపొందించారు. దీనిద్వారా ప్రాధమిక డిజిటల్ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడంతో పాటుగా తమ వ్యాపార సమర్థతనూ మెరుగుపరుచుకునేందుకు మహిళలకు తోడ్పడనున్నట్టు తెలిపింది.