Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సంపన్నదేశాల్లో మురిగిపోనున్న కోవిడ్ వ్యాక్సిన్ నిల్వలు
- యూరోపియన్ యూనియన్‌లో 41 శాతం,
- యూఎస్‌లో 32 శాతం నిరుపయోగం..ఎయిర్ ఫినిటీ సంస్థ
న్యూఢిల్లీ: ధనిక దేశాల నుంచి సేకరించిన దాదాపు 100 కోట్ల కోవిడ్ -19 వ్యాక్సిన్లు ఈ ఏడాది చివరి నాటికి వృధా అవుతాయని ఎయిర్ఫినిటీ సంస్థ వెల్లడించింది. పేద దేశాలకు సరైన మొత్తంలో వ్యాక్సిన్ ఇవ్వకుండా... ధనిక దేశాలు నిల్వ చేశాయి. అలా ఇబ్బడి ముబ్బడిగా గోడౌన్లలో ఉంచిన నిల్వలు నిరుపయోగం కానున్నాయని రిపోర్టులో పేర్కొన్నది. సెప్టెంబర్ 19 న సైన్స్ అనలిటిక్స్ కంపెనీ 'ఎయిర్ఫినిటీ' విడుదల చేసిన ఒక అంచనా ప్రకారం... పేద దేశాలలో 1.9 శాతం మంది ప్రజలు ఒక మోతాదు టీకాను పొందారనీ, యూఎస్,యూకే లాంటి దేశాల్లో రెండుడోసులు వేసుకున్నారని తెలిపింది. అయితే ఈ ఏడాది చివరి వధా అయ్యే 10 కోట్ల వ్యాక్సిన్లలో.. యూరోపియన్ యూనియన్ 41 శాతం, యూఎస్ 32 శాతం ఉన్నదని ఎయిర్ఫినిటీ తెలిపింది. ఇది వ్యాక్సిన్ పంపిణీలో విస్తృత అసమానతను ప్రతిబింబిస్తుంది. తక్కువ ఆదాయ దేశాలకు వ్యాక్సిన్ అందించే దిశగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నదని గ్లోబల్ జస్టిస్ నౌ పేర్కొన్నది. లక్షల మోతాదులను వృధా చేయడం దారుణమని గ్లోబల్ జస్టిస్ నౌ డైరెక్టర్ నికో డార్టెన్ చెప్పారు. ఇది చాలా మంది ప్రాణాలను కాపాడవచ్చు. కానీ కొన్ని సంపన్న దేశాల కంపెనీలు టీకా ఉత్పత్తిని గుత్తాధిపత్యం చేసినప్పుడు.. ఇలాంటి పరిస్థితి అనివార్యమవుతున్నదని వివరించారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఏర్పాటు చేసిన కోవిడ్ -19 వర్చువల్ సమ్మిట్ ముందు ఎయిర్ఫినిటీ నివేదిక బహిర్గతం కావటం చర్చనీయాంశంగా మారింది.