Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ముంబయిలో బాల్‌చంద్ర కాంగో అధ్యక్షతన సమావేశం
- మహారాష్ట్రలో 200కు పైగా వివిధ సంస్థల మద్దతు
ముంబయి: కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రధాని మోడీ నేతృత్వంలోని బీజీపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు, ఇటీవల తీసుకువచ్చిన వివాదాస్పద మూడు సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఈ నెల 27న దేశవ్యాప్త బంద్‌కు సంయుక్త్ కిసాన్ మోర్చా (ఎస్కేఎం) పిలుపునిచ్చింది. ఇప్పటికే దీనికి పలు ప్రతిపక్ష పార్టీలతో పాటు అనేక సంఘాలు మద్దతు పలికాయి. తాజాగా 27 భారత్ బంద్‌ను విజయవంతం చేయడానికి మహారాష్ట్రలోని 200లకు పైగా వివిధ పౌర సంఘాలు, సంస్థలు మద్దతు ప్రకటించాయి. దీనికి సంబంధించిన సమావేశం ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ (ఏఐటీయూసీ) వర్కింగ్ కమిటీ సభ్యులు బాల్‌చంద్ర కాంగో అధ్యక్షతన తాజాగా ముంబయిలో జరిగింది. దేశవ్యాప్తం సమ్మెకు రైతులు, కార్మికులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, అంగన్వాడీ కార్యకర్తలు, పారిశుధ్య కార్మికులు, యువకులు మద్దతు ప్రకటించారు. వివాదాస్పద మూడు వ్యవసాయ చట్టాల రద్దుతో పాటు పెట్రోల్, డీజిల్ ధరలను సైతం తగ్గించాలని డిమాండ్‌ను వెలిబుచ్చారు. 'లోక్‌సభలో వారికి ఉన్న మెజారిటీని ఉపయోగించుకుని సామాన్యుడి గొంతుకను అణచివేసి.. తన సన్నిహితులకు అనుకూలంగా సహాయం చేయవచ్చునని మోడీ సర్కారు భావిస్తోంది. అయితే, సామాన్యుడి ప్రయోజనాలను విస్మరించడం ద్వారా ఏ ప్రభుత్వమూ మనుగడ సాగించదని చరిత్ర నిరూపించిందని'' ఈ సమావేశంలో కాంగో అన్నారు. ఆల్ ఇండియా కిసాన్ సభ (ఏఐకేఎస్) అధ్యక్షుడు అశోక్ ధావలే మట్లాడుతూ.. 'రైతులు చారిత్రాత్మక పోరాటాన్ని వివరిస్తూ.. వివాదాస్పద మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పోరాటం సాగించలని రైతన్నలు నిశ్చయించుకున్నారు. నిరసనలు ప్రారంభమై 8 నెలలు దాటినా విరమించుకోలేదు. వేలాది మంది రైతులు, మహిళలు, యువకులు, విద్యార్థులు ఇప్పటికీ రోడ్లపై ఉన్నారు. కార్పొరేట్లకు అండగా.. వారికి అనుకూలంగా నడుస్తున్న ఏ డివిజన్ రాజకీయాలు రైతులు ఐక్యతను విచ్చిన్నం చేయలేవు. రాబోయే సమ్మె ప్రజల సంకల్పాన్ని చూపుతుంది' అని అన్నారు.
ఈ సమావేశంలో విద్యా చవాన్ (ఎన్సీపీ), ఉల్కా మహాజన్ (సర్వహర జన్ ఆందోళన్), తీస్తా సెతల్వాడ్ (సబ్రంగ్ ఇండియా), రాజు కోర్డే (పీడబ్ల్యూపీ) మేరాజ్ సిద్ధిఖీ (ఎస్పీ), ధనంజరు షిండే (ఆప్), ప్రభాకర్ నార్కర్ (జేడీఎస్్), ఎస్కే రాజే (సీపీఐ(ఎం)), ప్రకాశ్ రెడ్డి (సీపీఐ), ఫీరోజ్ మితిబోర్వాలా (హెచ్బీకేఎల్), అనిల్త్యాగి (ఎస్‌యూసీఐ), కిశోర్ ధమలే (ఎస్సీపీ), శుభాశ్ కకుస్తే (ఎల్ఎన్పీ), వివేక్ మోంటిరో(సీఐటీయూ), ప్రొఫెసర్ తపతి ముఖోపాధ్యారు (ఎంఎఫ్యూసీటీవో), మిలింద్ రనాడే (ఎన్టీయూఐ), యువరాజ్ ఘట్కల్ (ఎన్ఏపీఎం) ప్రాచీ హతివ్లేకర్ (ఐద్వా) వంటి నేతలతో పాటు వివిధ సంస్థలు నాయకులు సైతం ఈ సమావేశంలో పాల్గొన్నారు. భారత్ బంద్‌ను విజయవంతం చేయడానికి నేతలు, ఆయా సంస్థలు, పార్టీలు ప్రతిజ్ఞ చేశాయి. సమావేశం అనంతరం పలువురు నాయకులు అధికార మహా వికాస్ అఘాడీ నేతలను కలిసి.. దేశవ్యాప్త సమ్మెకు మద్దతు కోరారు.