Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గుజరాత్లో నిరసనబాట పట్టిన 'ఫోర్డ్' కార్మికులు
న్యూఢిల్లీ : ప్రముఖ వాహన తయారీ సంస్థ 'ఫోర్డ్ మోటార్'కి చెందిన కార్మికులు గుజరాత్లో నిరసనకు దిగారు. సన్సద్ సిటీలో ఫోర్ట్ తయారీ పరిశ్రమ ప్లాంట్ మూతపడటంతో వేలాది మంది కార్మికులు రోడ్డునపడ్డారు. కంపెనీ మూసేయటమనే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని, లేదా ఇందులో పనిచేస్తున్న కార్మికులకు మరోచోట ఉపాధి చూపాలని మంగళవారం నుంచి కార్మికులు నిరసన చేపడుతున్నారు. ఫోర్డ్ వాహన విడిభాగాల్లో ఇంజన్ సన్సద్ సిటీలోని కంపెనీ తయారు చేస్తోంది. వాహన అమ్మకాలు పడిపోయాయని, ఇక్కడి ఇంజన్ తయారీ ప్లాంట్ను మూసేయాలని ఫోర్డ్ కంపెనీ గత మూడేండ్లుగా ప్రయత్నిస్తోంది. ఈ ఏడాది చివరినాటికి ప్లాంట్ను వందశాతం మూసేయనున్నారు. దాంతో వేలాదిమంది కార్మికులు ఉద్యోగాలు, ఉపాధి కోల్పోయి రోడ్డునపడే పరిస్థితి ఏర్పడింది. ఈ నిరసనలపై అనిల్ సింగ్ జాలా అనే కార్మికుడు మాట్లాడుతూ..''గత ఏడేండ్లుగా ఈ కంపెనీలో పనిచేస్తున్నా. హఠాత్తుగా ఉద్యోగంలోంచి తీసేశారు. ఇప్పుడు నేనెక్కడికి వెళ్లాలి. ప్లాంట్ మూతపడకుండా గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వమే చర్యలు తీసుకోవాలి. లేదంటే కార్మికులకు మరోచోట ఉద్యోగాలు, ఉపాధి చూపాలని డిమాండ్ చేస్తున్నాం. మావి న్యాయమైన డిమాండ్లు'' అని అన్నారు.