Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : మహిళల హక్కులను, ఆకాంక్షలను నిరాకరించలేమని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. నేషనల్ డిఫెన్స్ అకాడమీ (ఎన్డీఏ)లో మహిళ అభ్యర్థులకు ఈ ఏడాది నుంచే అనుమతి ఇవ్వాలనీ, అందుకు ఎన్డీఏ పరీక్షలకు అనుమతించాలని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. నేషనల్ డిఫెన్స్ అకాడమీ, నావెల్ అకాడమీకి మహిళా అభ్యర్థులు హాజరు కావడానికి అనుమతించిన మధ్యంతర ఉత్తర్వులను తొలగించడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. ఎన్డీఏ ప్రవేశ పరీక్షలకు మహిళల్ని అనుమతించటాన్ని వచ్చే ఏడాదికి వాయిదా వేయాలన్న కేంద్ర ప్రభుత్వ విన్నపాన్ని సుప్రీంకోర్టు తిరస్కరించింది.
మహిళలకు దక్కాల్సిన హక్కుల్ని నిరాకరించలేమని వ్యాఖ్యానించింది. మహిళలను ఎన్డీఏలోకి అనుమతించే అవకాశాన్ని మరో ఏడాది పాటు వాయిదా వేయలేమని స్పష్టం చేసింది. మహిళలకు ఎన్డీఏ పరీక్షలకు అనుమతి కల్పించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ సంజరు కిషన్ కౌల్, జస్టిస్ హషీకేశ్ రారులతో కూడిన ధర్మాసనం బుధవారం విచారించింది. ఎన్డీఏలో ప్రవేశానికి మహిళా అభ్యర్థులను అనుమతించే నోటిఫికేషన్ వచ్చే ఏడాది(మే 2022)లో విడుదల చేయబడుతుందనీ,కనుక ఏడాది పాటు వాయిదా వేయాలని కేంద్ర ప్రభుత్వం కోరింది. దీనికి స్పందించిన సుప్రీం కోర్టు ధర్మాసనం ''పరీక్ష రాయడానికి సిద్ధంగా ఉన్న అభ్యర్థుల ఆకాంక్షలను దృష్టిలో ఉంచుకుని కేంద్రప్రభుత్వ అభ్యర్థనను అంగీకరించటం మాకు కష్టంగా ఉంది. సరిహద్దుల్లో సాయుధ దళాలు చాలా అత్యవసర పరిస్థితులను చూశాము. మేము జారీ చేసిన ఆర్డర్‌ను విరమించుకోం. పరిస్థితులు తలెత్తినప్పుడు ఆదేశాలు కోరడం కోసం మేము పిటిషన్‌ను ఇక్కడ పెండింగ్‌లో ఉంచుతాం''అని పేర్కొంది. స్త్రీ-పురుష సమానత్వం దిశగా సైన్యంలో చేరడానికి ఉద్దేశించిన ఎన్డీఏ ప్రవేశపరీక్షల్లో మహిళలు పాల్గొనడానికి అవకాశం కల్పించాలని సుప్రీంకోర్టు ఇటీవల ఆదేశించిన విషయం తెలిసిందే. రాబోయే పరీక్షల్లో మహిళా అభ్యర్థులు పాల్గొనడానికి వీలుగా నోటిఫికేషన్ ఇచ్చి తగిన ఏర్పాట్లు చేయాలని యూనియన్ పబ్లిక్ సర్వీసు కమిషన్‌ను ఆదేశించింది.a