Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : కోవిడ్-19 మహమ్మారి కారణంగా మరణించిన వారు కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియో అందించడంపై కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్నయంపై సుప్రీంకోర్టు గురువారం సంతృప్తి వ్యక్తం చేసింది. జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ (ఎన్‌డిఎంఎ) రూపొందించిన కొత్త మార్గదర్శకాల ప్రకారం.. కరోనాతో మరణించిన వారి కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వాలు తమ రాష్ట్ర విపత్తు స్పందన నిధి (ఎస్డిఆర్ఎఫ్) నుంచి రూ.50 వేలు చెల్లిస్తాయని కేంద్ర ప్రభుత్వం బుధవారం న్యాయస్థానానికి సమర్పించిన అఫిడవిట్లో పేర్కొంది. పరిహారానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కరోనా బాధిత కుటుంబాలకు కొంత ఓదార్పునిస్తుందని జస్టిస్ ఎంఆర్.షా, జస్టిస్ ఎఎస్ బోపన్నతో కూడిన ధర్మాసనం మౌఖికంగా పేర్కొంది.
జరిగిన నష్టాన్ని పూడ్చలేమని, అయితే అందుకు ప్రత్యామ్నాయంగా మనం ఏదో ఒకటి చేయగలమని కేంద్ర తరపు న్యాయవాది సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా అభిప్రాయపడ్డారు. ఎక్స్గ్రేషియోతో పాటు కరోనా మరణాలను ధ్రువీకరిస్తూ డెత్ సర్టిఫికెట్ల జారీ ప్రక్రియను సరళీకృతం చేయాలని ఎన్డిఎంఎను ఆదేశిస్తూ సుప్రీంకోర్టు జూన్ 30న ఇచ్చిన తీర్పును పాటించేలా చూడాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై న్యాయస్థానం వాదనలు వింటోంది. ఈ మేరకు కేంద్రం బుధవారం అఫడివిట్ దాఖలు చేసింది. తుది తీర్పును అక్టోబర్ 4న ఇస్తామని సుప్రీంకోర్టు పేర్కొంది.