Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: వాణిజ్య ట్రక్ డ్రైవర్లుకు నిర్ణీత పని గంటలు అంటూ కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ చేసిన ప్రకటనను అఖిల భారత రోడ్డు రవాణా కార్మికుల సమాఖ్య (ఏఐఆర్టీడబ్ల్యూఎఫ్) స్వాగతించింది. అయితే రోడ్డు ప్రమాదాలను తగ్గించడానికి నిజంగా సరైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. మోటార్ ట్రాన్స్పోర్టు కార్మికుల చట్టం-1961 సెక్షన్ 13, 15ల్లో రవాణా కార్మికుల పనిగంటలు, ఒక డ్యూటీ ముగిసిన తరువాత విశ్రాంతి తీసుకునే సమయాలను స్పష్టంగా పేర్కొన్నట్టు గుర్తు చేసింది. అయితే వీటిని అమలు చేయడం లేదని తెలిపింది. ట్రక్ డైవర్లుకు ప్రభుత్వం నుంచి ఎలాంటి గుర్తింపు లేదని పేర్కొంది. యంత్రాంగాన్ని రూపొందించి చట్టాన్ని అమలు చేయడం తక్షణావసరంగా తెలిపింది.నేషనల్ పర్మిట్ వాహనాలపై ఇద్దరు డ్రైవర్ల సదుపాయాన్ని బీజేపీ ప్రభుత్వమే రద్దు చేసిందని, దీనిని పునరుద్దరించాలని మంత్రికి విజ్ఞప్తి చేసింది.