Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : దేశంలో గత కొన్ని రోజులుగా కరోనా కేసులు హెచ్చుతగ్గులుగా నమోదవు తున్నాయి. బుధవారం నుంచి గురువారం వరకు 24 గంటల వ్యవధిలో 15,27,443 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 31,923 కేసులు వెలుగు చూశాయి. క్రితం రోజు (26,964)తో పోల్చితే కొత్త కేసులు 18 శాతం పెరిగాయి. దీంతో దేశంలో ఇప్పటి వరకు 3.35 కోట్ల మంది మహమ్మారి బారిన పడ్డారు. అదేవిధంగా గత 24 గంటల్లో 282 మందిని బలి తీసుకుంది. ఈ సంఖ్యతో కలిపి కరోనాతో 4,46,050 మంది మరణించారు. కాగా, 31 వేల కేసుల్లో ఒక్క కేరళలోనే 19,675 కేసులు నమోదు కావడం ఆందోళనకరం. మహారాష్ట్రలో 3 వేల మంది కరోనా బారిన పడ్డారు. ఇదే 24 గంటల్లో 31 వేల మంది డిశ్చార్జి కాగా, మొత్తంగా ఆ సంఖ్య 3.28 కోట్లకు చేరింది. ప్రస్తుతం 3,01,640 మంది చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం దేశంలో క్రియాశీల రేటు 0.90 శాతం, రికవరీ రేటు 97.77 శాతంగా ఉంది. బుధవారం 71.38 లక్షల మంది టీకాల పంపిణీ జరగ్గా... మొత్తంగా 83.39 కోట్ల డోసులు వినియోగమయ్యాయి.