Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ముగ్గురు మృతి
బెంగళూరు : కర్ణాటక రాజధాని బెంగళూరు నగరంలోని ఒక గోడౌన్లో గురువారం పేలుడు సంభవించింది. న్యూ థరాగుపేట్ ఏరియాలో జరిగిన ఈ ఘటనలో ముగ్గురు మరణించగా, మరో నలుగురికి గాయాలయ్యాయి. ఒక పంక్చర్ షాపునకు పక్కన ఉండే ట్రాన్స్‌పోర్టు గోడౌన్లో ఈ పేలుడు జరిగిందని బెంగళూరు సౌత్ డిప్యూటీ కమిషనర్ హరీష్ పాండే పేర్కొన్నారు. గౌడోన్‌లో నిల్వ ఉన్న రసాయనాల కారణంగా ఈ ప్రమాదం సంభవించిందని ఆయన తెలిపారు. '' గోడౌన్లో పేలుడు పదార్థాలతో కూడిన 80 బాక్స్‌లను నిల్వ చేశారు. వీటిల్లో ఎన్ని పేలాయో పరిశీలించాల్సి ఉంది'' అని పేర్కొన్నారు. ఈ ఘటనలో పంక్చర్ షాపులోని ఇద్దరితో సహా మొత్తం ముగ్గురు చనిపోగా.. మరణించిన వారిలో బాక్స్‌లను నిర్వహిస్తున్న కార్మికుడు ఒకరు ఉన్నారని తెలిపారు. నిర్వహణ లోపం కారణంగా ఈ పేలుడు సంభవించిందని ప్రాథమికంగా భావిస్తున్నామని, అయితే ఫోరెన్సిక్ బృందం పరిశీలన తర్వాత ఖచ్చితమైన కారణం తెలుస్తుందని పాండే అన్నారు. ఈ ఘటన సిలిండర్ పేలుడు కారణంగానో లేదా క్రాకర్లు లేదా విద్యుత్ షార్ట్‌సర్క్యూట్ కారణంగా జరిగిందో కాదని స్పష్టం చేశారు. ట్రాన్సిట్ గోడౌన్‌గా ఉపయోగించబడుతున్న ఈ స్టోరేజ్ ఫెసిలిటీ ఒక ట్రాన్స్పోర్ట్ కంపెనీకి చెందినది. సహజంగా ట్రాన్సిట్ గోడౌన్లో పేలుడు పదార్థాలను ఉంచడానికి అనుమతి లేదని డిసిపి పేర్కొన్నారు.